Asaam : బొగ్గుగనిలో చిక్కుకుపోయిన కార్మికులు.. ముగ్గురి మృతి
అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గుగనిలో చిక్కుకుపోయి ముగ్గురు కార్మికులు మరణించారు;
అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గుగనిలో చిక్కుకుపోయి ముగ్గురు కార్మికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. అస్సాంలోని దిమా హసావ్ జిల్లాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బొగ్గు గనిలో కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారి వంద అడుగుల నుంచి నీరు ప్రవేశించింది. ఈ నీటిలో దాదాపు పది మంది కార్మికుల వరకూ చిక్కుకుపోయారు.
వెలికి తీసేందుకు...
చిక్కుకుపోయిన కార్మికుల్లో ముగ్గురు మరణించగా మరో పది మంది వరకూ గాయపడ్డారు. అయితే గనుల్లో చిక్కుకుకపోయిన కార్మికులను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ తూర్పు నౌకాదళానికి చెందిన డ్రైవర్లు రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. గనుల్లో ఉన్న నీటిని తొలగించే ప్రక్రియ శరవేగంతో పనులు చేస్తున్నారు. గనుల్లో చిక్కుకుపోయినవారంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారే అని అధికారులు చెబుతున్నారు.