కాసేపట్లో పెళ్లి - అంతలోనే విషాదం
నిజామాబాద్ నవీపేట్ లో విషాదం నెలకొంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు బలవన్మరణం పొందింది
నిజామాబాద్ నవీపేట్ లో విషాదం నెలకొంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు బలవన్మరణం పొందింది. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టించింది. నిజామాబాద్ లో ఉండే రవళికి ఈరోజు వివాహం జరగనుంది. రాత్రి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె బలవన్మరణానికి పాల్పడటం అందరినీ విషాదంలో ముంచెత్తింది.
కాబోయే భర్త వేధింపులే...
కాబోయే భర్త వేధింపులే రవళి బలవన్మరణానికి కారణమాని వధువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి ముందుగానే కొన్ని షరతులు పెట్టడం వంటి కారణాలతోనే రవళి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.