దొంగతనానికి వెళ్లి కిచిడీ వండే ప్రయత్నం.. వడ్డిస్తున్న పోలీసులు !
ఇంటిని దోచుకునేందుకు వెళ్లిన దొంగకు ఆకలి వేయడంతో.. కిచిడీ చేసుకుని తిందామనుకున్నాడు. అనుకున్నదే తడవు.. కిచిడీ
ఇంటిని దోచుకునేందుకు వెళ్లిన దొంగకు ఆకలి వేయడంతో.. కిచిడీ చేసుకుని తిందామనుకున్నాడు. అనుకున్నదే తడవు.. కిచిడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నింటినీ రెడీ చేసుకున్నాడు. కానీ.. కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు పోలీసులు ఆ దొంగకు వేడివేడి కిచిడీ వడ్డిస్తున్నారు. ఆ ఇంట్లో నుంచి ఏవేవో శబ్దాలు వస్తుండటంతో.. ఇరుగు పొరుగువారు కిటికీలోంచి తొంగి చూడగా.. దొంగ కనిపించాడు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Also Read : సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత
అస్సాంలోని గుహవాటిలో జరిగిందీ ఘటన. అస్సాం పోలీసులు ఈ ఘటనపై సరదా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇదొక "ఆహార దొంగ కేసు" అంటూ కామెంట్ చేశారు. కిచిడీ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కానీ.. దొంగతనానికి వెళ్లినపుడు దానిని వండుకోవడం అంత శ్రేయస్కరం కాదంటూ చమత్కరించారు. దొంగను అరెస్ట్ చేసిన గువాహటి పోలీసులు అతడికి వేడివేడి ఆహారం వడ్డిస్తూ ఉండొచ్చని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు.