ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తత

హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది;

Update: 2021-11-20 08:26 GMT
sucide, n yadagiri gutta, father and daughter, cherukuri suresh, sreshta
  • whatsapp icon

హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థి విజయభాస్కర్ రాజు ఆత్మహత్య కు పాల్పడ్డారు. మెయినాబాద్ లో ఉన్న జేబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి గజ్జల విజయభాస్కర్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మరణించారు.

కళాశాల ఎదుట....
గజ్జల విజయ భాస్కర్ రాజు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. రెండు నెలల క్రితం కళాశాలలో జాయిన్ అయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. విద్యార్థి ఆత్మహత్యతో కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. విజయ్ భాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మొహరించారు.


Tags:    

Similar News