వనమా రాఘవకు ఊరట.. బెయిల్ మంజూరు

కొద్దిరోజుల క్రితం పాల్వంచకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తమ ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ..;

Update: 2022-03-10 12:44 GMT
వనమా రాఘవకు ఊరట.. బెయిల్ మంజూరు
  • whatsapp icon

ఖమ్మం : కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవకు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు వనమా రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొద్దిరోజుల క్రితం పాల్వంచకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తమ ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ వేధింపులే కారణమని.. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడంతో పోలీసులు వనమా రాఘవను అరెస్ట్ చేశారు. 61 రోజులు జైల్లో ఉన్న వనమా రాఘవ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించింది.

రాఘవ కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని హైకోర్టు షరతు విధించింది. అలాగే ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని షరతు విధించింది. కాగా.. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News