వీడిన శిరీష హత్య కేసు మిస్టరీ

గ్రామ శివారులోని నీటి గుంటలో యువతి మృతదేహాన్ని ఆదివారం గ్రామస్తులు గుర్తించారు. యువతి మృతదేహం గ్రామానికి చెందిన జంగయ్య;

Update: 2023-06-12 03:31 GMT

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్​ గ్రామ శివారులోని నీటి గుంటలో యువతి మృతదేహాన్ని ఆదివారం గ్రామస్తులు గుర్తించారు. యువతి మృతదేహం గ్రామానికి చెందిన జంగయ్య కూతురు జట్టు శిరీష (19) అని గుర్తించారు. వెంటనే కుటుంబీలకు సమాచారం ఇవ్వగా కాళ్లాపూర్​ గ్రామానికి చెందిన జట్టు శిరీష నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయిందని కుటుంబీకులు తెలిపారు. నీటి గుంటలో లభించిన శిరీషను స్క్రూడ్రైవర్​ తో కళ్లలో పొడిచి, గొంతుకోసి హత్య చేసి నీటి గుంటలో పడవేసినట్లు మృతదేహంపై ఆనవాళ్లు ఉన్నాయి.

శిరీష హత్య కేసు మిస్టరీ వీడింది. శిరీష అక్క శ్రీలత భర్త అనిల్ ఆమెను దారుణంగా హతమార్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. అనిల్, శిరీష మధ్య కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉందని తేలింది. శనివారం రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నావ్ అంటూ శిరీషను ఆమె అన్నయ్య తిట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటికొచ్చిన బావ అనిల్ కూడా శిరీషను మందలించాడు. దీంతో ఆమె మనస్థాపం చెందింది. అర్ధరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత శిరీష తలుపుని బయట నుంచి గడియపెట్టి వచ్చేసింది. ఇద్దరు కలుసుకున్న తర్వాత వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. శిరీషపై అనిల్ అత్యాచారం చేసి, ఆమె గొంతు కోసి చంపేశాడు. పోలీసులకు అనిల్‌పై అనుమానం ఉంది. శనివారం రాత్రి ఇంట్లో గొడవ జరగడం, అనిల్ ఆమెను కొట్టడం పోలీసులకు తెలిసింది. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆపై శిరీష ఫోన్‌ను పరిశీలించగా.. అందులో అనిల్ పేరుని డార్లింగ్‌గా ఆమె సేవ్ చేసుకుంది. అతడిపై అనుమానం మరింత పెరిగి విచారించడం మొదలుపెట్టారు. అనిల్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. తమదైన శైలిలో అడిగారు. అతడు నిజం మొత్తం చెప్పేశాడు.


Tags:    

Similar News