హైదరాబాద్ లో యువతిపై అత్యాచార యత్నం?

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక స్టార్ హోటల్ లో ఉన్న పబ్ లో ఒక యువతిని పట్ల కొందరు అసభ్యకరంగా వ్యవహరించారు.;

Update: 2022-06-21 04:17 GMT
హైదరాబాద్ లో యువతిపై అత్యాచార యత్నం?
  • whatsapp icon

జూబ్లీహిల్ల్ లో అమ్నీసియా పబ్ ఘటనను మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక స్టార్ హోటల్ లో ఉన్న పబ్ లో ఒక యువతిని పట్ల కొందరు అసభ్యకరంగా వ్యవహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టార్ హోటల్ లోని ఒక పబ్ లో యువతి పట్ల ఎనిమిది మంది యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిసింది. యువకులను ఆపేందుకు వచ్చిన వారిపై మందు బాటిళ్లలతో దాడి చేసినట్లు చెబుతున్నారు.

పోలీసులకు ఫిర్యాదుతో....
బాధితురాలి పట్ల అసభ్యంగా వ్యవహరించడంతో పాటు ఫోన్ నెంబరు కూడా ఆడిగారు. ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆ యువతిని అబ్రార్, సాథ్ అనే యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేస్తామని బెదిరింపులు కూడా చేశారనంటున్నారు. దీంతో బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీని బయటపెట్టాలని బాధితురాలు కోరుతుంది.


Tags:    

Similar News