బైక్ పై ప్రియురాలు షికార్లు.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం

ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని మార్వాడీ గుడి సమీపంలో..;

Update: 2023-03-20 06:06 GMT

తాను ప్రేమించిన యువతి.. తన కళ్లెదురుగానే కొత్త బైక్ పై షికార్లు కొట్టడం చూసి మనస్తాపం చెందాడు. దాంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని మార్వాడీ గుడి సమీపంలో ఉండే బవర్ సింగ్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీ దుకాణం నడుపుతున్నాడు. అతని రెండో కుమారుడు శైలేష్ సింగ్. స్థానికంగా ఉన్న ఓ యువతిని శైలేష్ ప్రేమిస్తున్నాడు. ఇటీవలే అతని ప్రియురాలు కొత్తబైక్ కొని తన ముందే షికార్లకు వెళ్లిరావడం ప్రారంభించింది.

ప్రియురాలు అలా చేయడం శైలేష్ కు నచ్చలేదు. బైక్ పై అలా వెళ్లొద్దని చెప్పినా ఆమె వినలేదు. దాంతో ఆదివారం సాయంత్రం శైలేష్ ప్రియురాలి ఇంటికెళ్లి.. మరోమారు బైక్ పై తిరిగితే బలవన్మరణం చేసుకుంటానని హెచ్చరించాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఆమె బదులివ్వడంతో మనస్తాపానికి గురైన శైలేష్ సింగ్ ప్రియురాలి ఇంటివద్దే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శైలేష్ శరీరంపై 80 శాతం వరకూ కాలిన గాయాలయ్యాయి. శైలేష్ పరిస్థితి విషమించడంతో న్యాయమూర్తి అతడి నుంచి మరణ వాంగ్మూలం తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం శైలేష్‌ను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






Tags:    

Similar News