తన చావుకు సీఎం జగన్, అధికారులు కారణమంటూ లేఖ

రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని జేబులో లేఖ కనిపించిం

Update: 2023-07-01 02:33 GMT

వైయస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం తుడుములదిన్నె గ్రామంలో రైతు వెంకటసుబ్బారెడ్డి (48) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి పేరుతో 8.29 ఎకరాల చుక్కల భూమి ఉంది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.10 లక్షల వరకు అప్పులపాలయ్యారు. ఇవి తీర్చడానికి పొలాన్ని బేరం పెట్టారు. పొలం తల్లి పేరుతో ఉండడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ పొలాన్ని వారసత్వ హక్కుల కింద తన పేరుతో మార్చాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని జేబులో లేఖ కనిపించింది. అందులో స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ నా చావుకు కారణమని ఉంది. రెవెన్యూ అధికారులు కూడా తన చావుకు బాధ్యులని అతడు చెప్పుకొచ్చాడు. తాను కార్యాలయాల చుట్టూ మూడేళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. నా భూమికి వారసత్వ హక్కులు కల్పించి ఉంటే అమ్ముకుని, అప్పు చెల్లించుకునేవాడినని వాపోయాడు.

అధికారులు మాత్రం ఇందులో తమ తప్పేమీ లేదని అంటున్నారు. నిబంధనల ప్రకారం మృతుడు తన భూమి విషయంలో మార్పులు చేసుకోలేదని తెలిపారు. తుడుములదిన్నె గ్రామ పరిధిలో సర్వే నంబరు 321/3 కింద 1.54 ఎకరాల పొలం వెబ్‌ల్యాండ్‌లో సుబ్బలక్ష్మమ్మ, భర్త వెంకటస్వామిరెడ్డి పేరు మీద ఉందని కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి తెలిపారు. మృతుడు వెంకట సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. సదరు భూమి రిజిస్టర్‌ అయ్యే విధంగా చూడాలని స్పందనలో రైతు ఆర్జీ సమర్పించారు. దానిని పరిశీలించిన ఖాజీపేట తహసీల్దారు ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం చుక్కల భూమిగా ఉన్నందున.. పట్టా భూమిగా మార్చడానికి అన్నదమ్ములు ఒక అవగాహనతో మీసేవ/ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించినా.. అర్జీదారు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. తెదేపా నాయకులు వెంకటసుబ్బారెడ్డి మృతదేహానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండు చేశారు.


Tags:    

Similar News