లక్ అంటే నీదేగా…?
దరిద్రంలో వున్న తన బాల్య స్నేహితుడు కుచేలుడి కోసం కృష్ణుడు చేసింది అందరికి తెలిసిందే. కృష్ణుడికి అటుకులు బహుమతిగా ఇచ్చి అంతులేని సంపదను ఆయననుంచి అందుకున్నాడు కుచేలుడు. [more]
దరిద్రంలో వున్న తన బాల్య స్నేహితుడు కుచేలుడి కోసం కృష్ణుడు చేసింది అందరికి తెలిసిందే. కృష్ణుడికి అటుకులు బహుమతిగా ఇచ్చి అంతులేని సంపదను ఆయననుంచి అందుకున్నాడు కుచేలుడు. [more]
దరిద్రంలో వున్న తన బాల్య స్నేహితుడు కుచేలుడి కోసం కృష్ణుడు చేసింది అందరికి తెలిసిందే. కృష్ణుడికి అటుకులు బహుమతిగా ఇచ్చి అంతులేని సంపదను ఆయననుంచి అందుకున్నాడు కుచేలుడు. ఇంచుమించు అలా అనిపించే సంఘటన అక్కడ జరిగింది. దక్షిణాదిలోని తమిళనాడులో వుండే సంప్రదాయాలు విభిన్నం. తమిళనాడు లోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సంస్కృతి కూడా ఉంటుంది. జల్లి కట్టు పోరాటం నుంచి అనేక అంశాల్లో తమిళ తంబిల స్టైల్ దేశవ్యాప్తంగా చర్చనీయం కావడం చూస్తూనే వున్నాం. తాజాగా తమిళనాడులోని ఒక ప్రాంతంలో వున్న ఒక పాత సంప్రదాయం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న వ్యక్తిని అమాంతం కోటీశ్వరుడిని చేసేసింది. ఈ అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
దరిద్రం పోవాలంటే ఇలా చేయాలిట ….
తమిళనాడు లోని పుదుక్కోట్ జిల్లా వడగాడు పరిసర గ్రామాల్లో ఒక ఆచారం సంప్రదాయంగా వస్తుంది. ఈ సంప్రదాయం ప్రకారం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నవారు బంధువులు స్నేహితులను పిలిచి విందు ఇవ్వాలి. ఆ విందుకు వచ్చిన వారంతా తమ స్థోమతకు తగిన విధంగా భోజనం అనంతరం సొమ్ములు చెల్లించి వెళతారు. వడగాడు లో ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న కృష్ణమూర్తి తన దరిద్రం పోవడానికి భారీ విందు కి ప్లాన్ చేశారు. సుమారు ఐదువేలమంది కి విందుకు రావాలంటూ ఆహ్వానం పలికారు.
ఇప్పుడు కోటీశ్వరుడు కృష్ణ మూర్తి …
పిలిచిన అతిధులు అంతా వచ్చేశారు. వీరికోసం వెయ్యి కేజీల మేకమాసంతో 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి విందు ఘనంగానే ఇచ్చాడు కృష్ణ మూర్తి. ఇక ఆ భోజనం తిన్నవారంతా ఇచ్చిన కానుకల సొమ్ము చూశాక ఆయనకు కళ్ళు తిరిగినంత పని అయింది. వారు ఇచ్చిన డబ్బు లెక్కపెట్టడానికి బ్యాంక్ సిబ్బంది సహకారాన్ని నగదు లెక్కింపు యాంత్రాల సహకారం తీసుకోవాలిసి వచ్చింది. అంతే కాదు పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేయించాలిసి వచ్చింది. తీరా లెక్కలన్నీ చూశాక నాలుగుకోట్ల రూపాయలు రావడంతో కృష్ణమూర్తి ఆనందానికి అంతే లేదు. ఇది చూసిన, విన్నవారు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. లక్ అంటే అంతేగా అంతేగా.