అచ్చెన్న వ్యవహారంలో ఎవరి వ్యూహం వారిదే?

చట్టాలు కలిగిన వారికి పవర్ ఉన్నవారిని ఏమి చేయలేవని అనేక కేసులు చెప్పక చెబుతాయి. బడా బాబులుగా వెలుగొందేవారు చట్టాల్లోని లోపాలను చుట్టాలుగా వాడేయటం రివాజుగానే వస్తుంది. [more]

Update: 2020-06-15 05:00 GMT

చట్టాలు కలిగిన వారికి పవర్ ఉన్నవారిని ఏమి చేయలేవని అనేక కేసులు చెప్పక చెబుతాయి. బడా బాబులుగా వెలుగొందేవారు చట్టాల్లోని లోపాలను చుట్టాలుగా వాడేయటం రివాజుగానే వస్తుంది. దీనికి చంద్రబాబు బావమరిది కం వియ్యంకుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కాల్పుల కేసు శరవేగంగా సాగడం. బెయిల్ త్వరగా లభించడం, ఆ తరువాత చట్టంలో ఉన్న మానసిక స్థితి సరిగా లేదనే అవకాశాన్ని చక్కగా వాడుకుని అంతా అనుకున్నట్లే బయటపడిపోయారు ఆయన. ఇందులో న్యాయస్థానం సైతం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడి బాలయ్య నిర్దోషిగా ఆ కేసు నుంచి చక్కగా వచ్చేశారు.

మానసిక స్థితి కేసు కొట్టేసిన వెంటనే …

ఆ తరువాత అనేక సినిమాల్లో హీరో గా టిడిపి తరపున రెండు సార్లు ఎమ్యెల్యే గా కూడా గెలిచేశారు. ఆయన మానసిక స్థితి బాగోలేదన్న పాయింట్ ఆ తరువాత కాలంలో చర్చలోనే లేకుండా పోయింది. బాలకృష్ణ కేసులో నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి సాయం చేయబట్టే పని సులువు అయిందన్నది పబ్లిక్ లో ఉన్న టాక్. అందుకే ఇటీవల ఆ కేసును చిరంజీవి పై విమర్శలు సంధించిన సందర్భంలో పరోక్షంగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ట్వీట్ చేసి మరోసారి అందరికి గుర్తు చేసి అవసరమైతే పాత కేసు వ్యవహారం రచ్చ చేస్తామన్న సందేశం ఇచ్చేశారు. దాంతో బాలయ్య ఆయన బృందం సైతం సైలెంట్.

జైలు గుమ్మం ఎక్కకుండా …

ఇక పెద్దలు ఎవరు ఏ కేసుల్లో అరెస్ట్ అయినా వారికీ వెంటనే తమలో ఉన్న రోగాలు అన్ని గుర్తుకు వచ్చేస్తాయి. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి గల్లీ స్థాయి లీడర్ వరకు హాస్పిటల్ లో జైలు జీవితం గడిపే అన్ని దారులు వెతుకుతూనే వుంటారు. దీనికి చక్కగా వారి న్యాయవాద బృందాలు సహకరిస్తూ ప్రతీ చిన్న అవకాశాన్ని వినియోగించుకునేలా కథ నడిపిస్తాయి. ఇప్పుడు అదే రీతిలో ఈ ఎస్ ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన అచ్చెన్న జైలు కు వెళ్లకుండా ఆసుపత్రి కేంద్రంగా బెయిల్ వచ్చేదాకా వ్యవహారం సాగతీయడానికి పసుపు పార్టీ రంగం సిద్ధం చేసినట్లు వైసిపి వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.

అచ్చెన్న అసలు సమస్య ఇది …

పెరి యానల్ అబ్సిస్ అనే సమస్య ఆయనకు వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.మలద్వారం వెనుక చీము‌ పట్టి దారుణమైన నొప్పి రావటం ఈ వ్యాధి‌లక్షణం. దీనికి కారణం బాక్టీరియా క్రిములు. ఇది చాలా మందికి సెగ్గడ్డలా చితికిపోయి ఇంటి వద్దనే చీము రక్తం‌కారిపోయి‌ తగ్గిపోతుంది. లేదా వైద్యుల వద్దకు వెళితే వారు ఆ చీము‌పట్టిన చోట చిన్న గాటు పెడతారు. అది ఆపరేషన్ కాదు…ఇంజెక్షన్ అంత నొప్పి మాత్రమే ఉంటుంది. కానీ ఆ కటింగ్ వద్ద ప్యాడ్స్ పెట్టుకుని రెండు మూడు రోజులు మార్చుకోవాలి. చెడు రక్తమంతా పోయి కురుపు ‌మానిపోతుంది. గాటు పెట్టి చీము తీయగానే నొప్పి మొత్తం మంత్రం వేసినట్లు తగ్గిపోతుంది. అచ్చెన్నాయుడు కి ఆ కటింగ్ అయింది. కనుక రెండు‌మూడు రోజులు ‌బ్లీడింగ్ విత్ పస ఉంటుంది. ఇది ఏ మాత్రమూ ప్రమాదకరం కాదు. అదే కనుక ఆస్పత్రికి వెళ్లకముందు అరెస్టు చేసి ఉంటే ఆయన కదిలినా, మెదిలినా నొప్పితో విలవిల్లాడి ఉండేవారు.

ఆసుపత్రి లేదా బెయిల్ కోసం వ్యూహం …

వాస్తవంగా చాలా మందిలో ఎదురయ్యే ఈ చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి నానా రాద్ధాంతం చేస్తుంది ప్రధాన విపక్షం. దీన్ని ప్రామాణికంగా చూపిస్తూ వైద్యం సాకుతో ఒక పక్క ఆసుపత్రిలో ఉంచాలని బెయిల్ త్వరగా పొందాలన్నది విపక్షం వ్యూహం. అయితే దీనిపై అధికార వైసిపి ప్రత్యామ్నాయ వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరం. పేరుకు ఎసిబి కేసు అయినప్పటికి వైసిపి వర్సెస్ టిడిపి వార్ గా మారిన ఈ వ్యవహారం ఎక్కడిదాకా పోతుందనేది ఎపి పొలిటికల్ స్క్రీన్ పైనే చూడాలి మరి.

Tags:    

Similar News