అచ్చెన్న మీద ఆ …అస్త్రం రెడీ అయినట్లుందిగా ?
చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 2018 అక్టోబర్ లో తిత్లీ తుఫాన్ వచ్చి శ్రీకాకుళం జిల్లాను దారుణంగా నష్టపరచింది. ఈ తుఫాన్ దెబ్బతో సిక్కోలు రెక్కలు పూర్తిగా [more]
చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 2018 అక్టోబర్ లో తిత్లీ తుఫాన్ వచ్చి శ్రీకాకుళం జిల్లాను దారుణంగా నష్టపరచింది. ఈ తుఫాన్ దెబ్బతో సిక్కోలు రెక్కలు పూర్తిగా [more]
చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 2018 అక్టోబర్ లో తిత్లీ తుఫాన్ వచ్చి శ్రీకాకుళం జిల్లాను దారుణంగా నష్టపరచింది. ఈ తుఫాన్ దెబ్బతో సిక్కోలు రెక్కలు పూర్తిగా విరిగాయి. ఆనాడు జిల్లా మొత్తం మీద ఈ తుఫాన్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. దాంతో ప్రజలంతా నానా ఇబ్బందులు పడ్డారు. పంటలు పోయాయి. ఇల్లూ వాకిళ్ళూ కూడా పోయి జనాలు నిరాశ్రయులయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే అత్యంత వెనకబాటుతనానికి నిదర్శనంగా ఉన్న శ్రీకాకుళం కధ ఇంకా దయనీయమైంది. అప్పట్లో చంద్రబాబు శ్రీకాకుళం టూర్ చేశారు, బాధితులను ఆదుకుంటామని చెబుతూ పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం ప్రకటించారు.
దోచుకున్నారా…..?
ఇక తిత్లీ కధ కూడా అక్కడే మొదలైంది. ఏపీ సర్కార్ తరఫున అర్ధిక సాయం పెద్ద ఎత్తున వచ్చినా కూడా అది రాజకీయ పెద్దల వద్దలే చేరిపోయిందని, అసలైన బాధితులు, నిరుపేదలకు కనీసంగా కూడా సాయం దక్కలేదని నాడే కధనాలు వచ్చాయి. అప్పట్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహించారు. కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు ఏలుబడిలో సాగిన సహాయ చర్యలు పూర్తిగా స్వపక్షం అయ్యాయని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు అనుచర వర్గం సహాయాన్ని దారి మళ్ళించారని కూడా ప్రచారం అయితే సాగింది. విమర్శలు చేసింది కూడా వైసీపీ నేతలే.
అదే ఆయుధం …..
ఇక అచ్చెన్నాయుడు ఇపుడు ఏపీ టేడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన మెల్లగా సౌండ్ చేస్తున్నారు. వైసీపీ నేతల మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో రెండేళ్ల క్రితం నాటి తిత్లీ తుఫాన్ అవినీతి బాగోతాన్ని ఇపుడు వైసీపీ మంత్రులు తెర ముందుకు తెస్తున్నారు. తెలుగుదేశం దొంగలు తిత్లీ తుఫాన్ సాయాన్ని తినేశారు అంటూ మంత్రి అప్పలరాజు గట్టిగానే తగులుకుంటున్నారు. పేద ప్రజలకు పక్కన పెట్టి మరీ తుఫాన్ సాయాన్ని కూడా పంచుకున్న టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ మీద ఆరోపణలు చేయడమేంటి అని కూడా నిందిస్తున్నారు. ఇక ఇంకోవైపు చూసుకుంటే నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు తిత్లీ అవినీతిని ముడిపెడుతూ వైసీపీ చేస్తున్న విమర్శలు ఆషామాషీగా కావని కూడా అంటున్నారు.
లెక్కలు తేరుస్తారా…?
తిత్లీ తుఫాన్ సహాయ చర్యల్లో జరిగిన అవినీతి మీద సీరియస్ గానే వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తోందని అంటున్నారు. నిజానికి అచ్చెన్నాయుడును టార్గెట్ చేసిన నాడే ఆయన మీద తిత్లీ అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారు. ఇపుడు దానికి తగినట్లుగానే వరసపెట్టి తిత్లీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇవి ఊరకే కాకుండా రికార్డులతో సహా జనం ముందు పెట్టాలని కూడా వైసీపీ నేతలు నిర్ణయించారు. మరి అదే కనుక జరిగితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో అచ్చెన్నాయుడు మరో పోరాటానికి సిధ్ధపడాలేమో. అవినీతి జరిగిందా లేదా అన్నది వైసీపీ సర్కార్ తేల్చితే మంచిదే కదా అని ఇతర విపక్షాలు కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.