మ‌హూర్తం ఫిక్స్‌.. అచ్చెన్న చుట్టూ రాజ‌కీయ ఉచ్చు

ఎన్నిక‌లు ముగిశాయి. ప‌ది నెల‌లు గ‌డిచిపోయాయి. దీంతో ప్రతిప‌క్ష, అధికార ప‌క్షాల మ‌ధ్య కూడా రాష్ట్రస్థాయిలో రాజ‌కీయాలే తప్ప నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో రాజ‌కీయాలు త‌గ్గాయ‌నే చెప్పాలి. అయితే, [more]

Update: 2020-02-26 13:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి. ప‌ది నెల‌లు గ‌డిచిపోయాయి. దీంతో ప్రతిప‌క్ష, అధికార ప‌క్షాల మ‌ధ్య కూడా రాష్ట్రస్థాయిలో రాజ‌కీయాలే తప్ప నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో రాజ‌కీయాలు త‌గ్గాయ‌నే చెప్పాలి. అయితే, అనూహ్యంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి రాజ‌కీయం మాత్రం భోగి మంట మాదిరిగా ర‌గులుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విజ‌యం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన పేరాడ తిల‌క్ ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో కొన్నాళ్లుగా ఇక్కడ రాజ‌కీయం స్తబ్దుగానే ఉంది. అయితే, అనూహ్యంగా ఇప్పుడు వాడి వేడిగా మారింది.

ఈఎస్ఐ నుంచి తిత్లీ వరకూ…..

టీడీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా.. ఆ పార్టీ నేత‌ల దూకుడు మాత్రం త‌గ్గలేదు. వైసీపీపై విమ‌ర్శలు చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు మ‌రింత‌గా గ‌ళం వినిపిస్తున్నారు. అయితే, ఇప్పటి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న పేరాడ తిల‌క్ .. తాజాగా అచ్చెన్నాయుడు పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో ఒక్కసారిగా త‌న ప‌వ‌ర్ ఏంటో చూపిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అచ్చెన్నాయుడుతో ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈఎస్ఐ కుంభ‌కోణం స‌హా తిత్లీ తుఫాను స‌మ‌యంలో ప్రజ‌ల‌కు అందాల్సిన అన్నింటినీ.. కూడా ప‌క్కదారి ప‌ట్టించి అచ్చెన్నాయుడు దోచుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వైసీపీ వ‌ర్గాల నుంచి భారీగా వినిపిస్తున్నాయి. దీంతో అచ్చెన్నపై రాజ‌కీయ వ్యూహాత్మక దాడి పెరిగింది.

నిరూపించేందుకు …..

అయితే, పైకి మాత్రం తాను పులుక‌డిగిన ముత్యమ‌ని అచ్చెన్నాయుడు చెబుతున్నా.. ఈఎస్ఐ అక్రమం మాత్రం ఆయ‌న‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు త‌న అన్న అయిన దివంగ‌త కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్న సాక్షిగా చెబుతున్నా.. అంటూ ఇటీవ‌ల కొన్ని స‌వాళ్లు కూడా రువ్వారు. అయితే, దీనికి ప్రతిగా పేరాడ తిల‌క్ అచ్చెన్నాయుడును టార్గెట్ చేస్తున్నారు. అచ్చెన్న అక్రమాల‌ను నిరూపించేందుకు తాను సిద్ధమ‌ని ఆయ‌న వెల్లడించారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఓ ముహూర్తం కూడా ఆయ‌న సిద్ధం చేశారు.

మార్చి 2న ముహూర్తం….

కింజరాపు కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులను ఆధారాలతో సహా బహిర్గతం చేయడానికి మార్చి 2న టెక్కలి అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తామని…అచ్చెన్నాయుడుకు దమ్ముంటే చర్చా వేదికకు వచ్చి తన నిజాయితీ నిరూపించుకోవాలని తిలక్‌ సవాల్‌ విసిరారు. దీంతో ఇప్పుడు బంతి అచ్చెన్నాయుడు కోర్టులో ప‌డింది. మ‌రి దీనికి ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మొత్తానికి అచ్చెన్నకు ముహూర్తం కుదిరింద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ఇదే టైంలో నిన్న మొన్నటి వ‌ర‌కు టెక్కలి వైసీపీలో పేరాడ తిల‌క్‌, దువ్వాడ శ్రీనివాస్‌, కిల్లి కృపారాణి వ‌ర్గాలు ఉండేవి. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కేసులో ఇరుక్కోవ‌డంతో ఆయ‌న్ను మ‌రింత‌గా టార్గెట్ చేస్తూ ఈ మూడు వ‌ర్గాలు ఒక్కట‌య్యాయి. మ‌రి ఈ ముగ్గురు నేత‌లు అయినా అచ్చెన్న దూకుడుకు ఎంత వ‌ర‌కు బ్రేకులు వేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News