తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నే షార్ప్ షూటర్
టీడీపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. చాలా విషయాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు సీనియర్లను సైతం విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఆయన చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. [more]
టీడీపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. చాలా విషయాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు సీనియర్లను సైతం విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఆయన చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. [more]
టీడీపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. చాలా విషయాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు సీనియర్లను సైతం విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఆయన చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. ఎవరిని ఎక్కడ ఏమేరకు వాడుకోవాలో.. ఎవరిని ఏమేరకు ఎక్కడ ఉంచాలో కూడా అక్కడే ఉంచుతున్నారు. పార్టీలో కేవలంగా ఉండిపోయామని చెబితే చాలదు.. పార్టీ కోసం అహరహం శ్రమించేవారికి, తమ సొంత లాభం కన్నా కూడా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసేవారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు కీలకంగా కనిపిస్తున్నారు టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.
ట్రబుల్ షూటర్ గా…
పార్టీలో ఏ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నా.. ఏదైనా సమస్య తెరమీదికి వచ్చినా..వెంటనే టీడీపీ నుంచి షార్ప్ షూటర్ మాదిరిగా వెలుగులోకి వస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అచ్చెన్నాయుడుకే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. పార్టీ అధికారంలో ఉన్నసమయంలో కాపుల రిజర్వేషన్ సమస్య తెరమీదికి వచ్చింది. వెంటనే చంద్రబాబు అచ్చెన్నాయుడు (అప్పటి మంత్రి)ను రంగంలోకి దింపారు. అప్పటి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చలకు పంపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కీలక విషయాల్లో చంద్రబాబు అచ్చెన్నాయుడును వాడుకుని ట్రబుల్ షూటర్ గా వాడుకున్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు కూడా…
ఇక ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక కీలక విషయాల్లో చంద్రబాబు అచ్చెన్నాయుడునే నమ్మడంతో పాటు అచ్చెన్నకే ప్రయార్టీ ఇస్తున్నారు. తాజాగా ఇప్పుడు విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన జరిగింది. ఈ విషయంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీకి కూడా అచ్చెన్నాయుడునే చైర్మన్‌గా నియమించారు చంద్రబాబు. వాస్తవానికి విశాఖ నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ముగ్గురు మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ మూర్తి, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నా వారిని బాబును నమ్మకుండా అచ్చెన్నాయుడును నమ్ముతున్నారన్నది స్పష్టమైంది.
ఎవరిపై నమ్మకం లేకనే?
అయినా కూడా చంద్రబాబు నగరంలో జరిగిన ఘటన విషయంలో అచ్చెన్నాయుడును చైర్మన్ గా వేస్తూ.. కమిటీని నియమించారు. మరి ఇక్కడ ఏంజరిగింది? నాలుగు నియోజకవర్గాల్లో నలుగురు కూడా టీడీపీ తరఫునే విజయంసాధించారు కదా? అయినా కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. చంద్రబాబు ఎక్కడి నుంచో టెక్కలి నుంచి తెప్పించి అచ్చెన్నాయుడుకు అవకాశం కల్పించారు. దీనికి కేవలం నేతల మధ్య సఖ్యత లేకపోవడం, నోరుతెరిస్తే.. ఏం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్థానిక నేతలను సైతం పక్కన పెట్టి.. అచ్చెన్నాయుడుకు ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో అచ్చెన్నాయుడు షార్ప్ షూటర్‌గా తన ప్రస్థానం అయితే కంటిన్యూ చేస్తున్నారు.