హన్నన్నా… అచ్చెన్నా…. ఇదేందన్నా?
ఇది చాలా బాగుంది. వర్తమాన కాలంలో రాజకీయ పార్టీలకు ఒక స్టాండ్ అంటూ లేకుండా పోతోంది. తాము అన్న మాటలనే అటూ ఇటూ అనుకూలంగా తిప్పుకుంటూ చివరకు [more]
ఇది చాలా బాగుంది. వర్తమాన కాలంలో రాజకీయ పార్టీలకు ఒక స్టాండ్ అంటూ లేకుండా పోతోంది. తాము అన్న మాటలనే అటూ ఇటూ అనుకూలంగా తిప్పుకుంటూ చివరకు [more]
ఇది చాలా బాగుంది. వర్తమాన కాలంలో రాజకీయ పార్టీలకు ఒక స్టాండ్ అంటూ లేకుండా పోతోంది. తాము అన్న మాటలనే అటూ ఇటూ అనుకూలంగా తిప్పుకుంటూ చివరకు ప్రజలకు వెర్రివాళ్ళను చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కొత్త పూజారి అచ్చెన్నాయుడుకు అర్జంటుగా శ్రీకాకుళాన్ని రాజధానిగా చేయాలని కోరిక పుట్టింది. అందుకే ఆయన జగన్ ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఉంటే అమరావతి లేకపోతే శ్రీకాకుళం అంటూ పెద్ద కోరికే కోరుతున్నారు. చంద్రబాబు కలల రాజధాని అమరావతిని ఎక్కడా తక్కువ చేయకుండా అలాగని ఉత్తరాంధ్ర వాసులకు, ప్రత్యేకించి తన జిల్లా జనాలకు చెడ్డ కాకుండా అచ్చెన్నాయుడు బాగానే రాజకీయ నైపుణ్యం చూపిస్తున్నారు అంటున్నారు.
విశాఖ వద్దా ….?
ఎన్ని అయినా చెప్పండి ఎందుకో టీడీపీకి విశాఖ మాత్రం రాజధానిగా అసలు కనిపించడంలేదులా ఉంది. ఎందుకంటే జగన్ విశాఖను ఎంచుకున్నారు కాబట్టి ఆయన ఎడ్డేమంటే తాము తెడ్డేమని అనాల్సిందే. ఇదే తమ్ముళ్ళ థియరీ తప్ప విశాఖ ఎందుకు వద్దు శ్రీకాకుళం ఎందుకు ముద్దు అన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇక శ్రీకాకుళం రాజధానిగా చేస్తే భూములు ఉచితంగా ఇప్పిస్తామంటూ అచ్చెన్నాయుడు జగన్ కే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇది కూడా అచ్చం బాబు బాటలోనే మాట్లాడారని అంటున్నారు. అమరావతి భూములు బాబు సేకరిస్తే సిక్కోలులో అచ్చెన్నాయుడు పలుకుబడి ఉపయోగిస్తారన్న మాట. ఎటూ జగన్ శ్రీకాకుళానికి మొగ్గు చూపరు కాబట్టి అమరావతి రెండవ ఆప్షన్ గా ఉంచుకున్నారన్న మాట. ఇదే తమ్ముళ్ళ అతి తెలివి అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇది చాలా….
గతంలో ఇదే మాటను పాత ప్రెసిడెంట్ కళా వెంకటరావు కూడా అన్నారు. విశాఖ వద్దు పెడితే మా శ్రీకాకుళంలోనే రాజధాని పెట్టండని ఆయన బాగానే సౌండ్ చేశారు. అయినా మూడు రాజధానులు అని జగన్ అంటున్నారు కదా శ్రీకాకుళంలో క్యాపిటల్ పెడితే వైసీపీ స్టాండ్ తో టీడీపీ ఏకీభవిస్తుందా అంటే దానికి తమ్ముళ్ళ వద్ద సమాధానం నిల్. నిజంగా సిక్కోలులో రాజధాని అని వైసీపీ ముందుకు వస్తే అపుడు మా నిమ్మాడలో సచివాలయం పెట్టండని ఇదే అచ్చెన్నాయుడు అడగకుండా ఉండకపోతారా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని అని గట్టిగా అంటే ఎక్కడ ఉత్తరాంధ్రా జనాలు మండిపడతారో అని తెలివైన ఎత్తులు వేస్తున్నారు తమ్ముళ్ళు అంటున్నారు.
అదే పాట …?
ఇక ఎన్నికలకు పోదాం అన్నది చంద్రబాబు పాట. జగన్ ఇలా సీట్లో కూర్చున్నారో లేదో త్వరలో ఎన్నికలు అంటూ రాగాలు పెడుతున్నది కూడా కూడా పెదబాబే. ఇపుడు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి రెడ్డొచ్చె మొదలెట్టు అన్న చందాన జగన్ని అసెంబ్లీ రద్దు చేయమంటూ పాత డిమాండ్ ని కొత్తగా చేస్తున్నారు. మూడు రాజధానుల మీద జనాభిప్రాయం కోరాలట జగన్. ఆ ఎన్నికల్లో ప్రజలు తిరిగి వైసీపీని ఎన్నుకుంటే తాము బుద్ధిగా సమర్ధిస్తామని, అసలు అమరావతి రాజధాని వూసు కలలోనైనా తలవమని కూడా అచ్చెన్నాయుడు శుద్ధ పూస కబుర్లు చెబుతున్నారు. అవన్నీ సరే కానీ ముందు తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక ఉంది. ఆ తరువాతో ముందో స్థానిక ఎన్నికలు కూడా ఏపీలో ఉన్నాయి. అక్కడ గెలిచి అపుడు మాట్లాడండి అని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయినా కానీ బాబుకు సిసలైన తమ్ముడు అచ్చెన్న చెవిన ఈ మాటలు పడతాయా.