అచ్చెన్న దూకుడుకు బ్రేకులు ?
కొత్త పదవి అని మురిసినంత సేపు పట్టలేదు అసలు విషయం అర్ధం కావడానికి. తమ నేతకు ఇపుడు పేరుకు పదవి కానీ ఫుల్ సైలెంట్ కావాల్సి వచ్చిందని [more]
కొత్త పదవి అని మురిసినంత సేపు పట్టలేదు అసలు విషయం అర్ధం కావడానికి. తమ నేతకు ఇపుడు పేరుకు పదవి కానీ ఫుల్ సైలెంట్ కావాల్సి వచ్చిందని [more]
కొత్త పదవి అని మురిసినంత సేపు పట్టలేదు అసలు విషయం అర్ధం కావడానికి. తమ నేతకు ఇపుడు పేరుకు పదవి కానీ ఫుల్ సైలెంట్ కావాల్సి వచ్చిందని కింజరాపు వీర భక్తులు తెగ ఇదైపోతున్నారుట. నిజానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కాక ముందు వైలెంట్ గా ఉండే అచ్చెన్నాయుడు ఇపుడు నిమ్మాడలో చాలా కామ్ గా ఉంటున్నారు. ఆయన ఏం మాట్లాడినా ఇపుడు ఒక లెక్క ఉంటుందిట. దాంతో ఆయన లెక్కలు అన్నీ సరిచూస్తూ ఏది మాట్లాడాలో అధినాయకత్వమే డిసైడ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాలతో అచ్చెన్నాయుడుశిబిరం కలవరపడుతోందిట.
దూకుడు తగ్గాలా…?
బాగా అల్లరి చేసే కుర్రాడిని తెచ్చి క్లాస్ లీడర్ ని చేసినట్లుగా ఉందిట అచ్చెన్నాయుడు వ్యవహారం. ఆయన మాజీ మంత్రిగా, టీడీఎల్పీ ఉప నేతగా ఉన్నపుడే నయం అంటున్నారు. జగన్ మీద ప్రతీ దానికీ చెలరేగిపోయేవారు ఇపుడు పెద్ద పదవి అంటూ కాళ్ళూ చేతులూ కట్టేశారు అని అనుచరుల నుంచే మాట వస్తోంది. అచ్చెన్నాయుడు తన దూకుడుని గతంలో మాదిరిగానే చూపించాలనుకున్నారుట. అయితే శాంతం అంటూ తెర వెనక నుంచి అధినాయకత్వం ఆపుతోందని అంటున్నారు.
టూర్లకు నో ..?
కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లిమ్ మైనారిటీ కుటుంబం పోలీస్ వేధింపులకు బలి అయింది, ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబ సభ్యులకు పరామర్శించడానికి అచ్చెన్నాయుడు రెడీ అయ్యారని భోగట్టా. అయితే చివరి నిముషంలో టూర్ కి బ్రేక్ పడిందట. ఇపుడు అంత అర్జంటుగా వెళ్లాల్సిన అవసరం లేదు అని అధినాయకత్వం నుంచి వర్తమానం వచ్చిందట. అదే విధంగా ఫోన్ లో పరామర్శిస్తే చాలు అని కూడా సలహా ఇచ్చారట. ఇక అచ్చెన్నాయుదు అయితే పదమూడు జిల్లాలూ కలియ తిరగాలని, మొత్తం క్యాడర్ తో రిలేషన్స్ పెంచుకోవాలని చూస్తున్నారుట. కానీ ఇపుడు కాదు, తరువాత అంటూ హై కమాండ్ అడ్డుపుల్ల వేస్తోంది అని కూడా ప్రచారం సాగుతోంది.
హోదా పేరుకేనా…?
బీసీకి పెద్ద పదవి ఇచ్చాం, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ని చేశామని చంద్రబాబు జబ్బలు చరచుకుంటున్నారు. కానీ నిజానికి బీసీ నేత జనంలోకి వెళ్ళి దూకుడు రాజకీయం చేయడానికి టీడీపీలో వీలుందా అన్నదే ఇపుడు చర్చట. అచ్చెన్నాయుడు ఫైర్ బ్రాండ్. ఆయన జిల్లాలకు వెళ్ళి క్యాడర్ కి జోష్ తెస్తే కచ్చితంగా టీడీపీలో కొత్త నాయకత్వం పోటీగా ఏర్పడుతుంది. కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాలేకపోతున్నారు. ఇక లోకేష్ అలా తిరిగి ఇలా వచ్చేస్తున్నాడు ఇపుడు అచ్చెన్నాయుడు కనుక కాలికి గజ్జె కట్టి రాష్ట్రమంతా తిరిగితే వైసీపీ సంగతేమో కానీ టీడీపీ కూసాలు కదిలిపోతాయన్న బెంగ బెరుకు హై కమాండ్ లో ఎక్కడో ఉన్నట్లుంది అంటున్నారు. అదే కనుక నిజమైతే అచ్చెన్నాయుడు ఇక నిమ్మాడను దాటి బయటకు రానవసరం లేదేమో.