బాబాయి బరువైపోతున్నాడా
సిక్కోలు రాజకీయాలకు, కింజరపు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. కింజరపు ఎర్రన్నాయుడు యువ న్యాయవాదిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత రాజకీయ అరంగేట్రం చేసి పాతికేళ్ళ [more]
సిక్కోలు రాజకీయాలకు, కింజరపు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. కింజరపు ఎర్రన్నాయుడు యువ న్యాయవాదిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత రాజకీయ అరంగేట్రం చేసి పాతికేళ్ళ [more]
సిక్కోలు రాజకీయాలకు, కింజరపు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. కింజరపు ఎర్రన్నాయుడు యువ న్యాయవాదిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత రాజకీయ అరంగేట్రం చేసి పాతికేళ్ళ ప్రాయంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత వరసగా గెలుస్తూ వచ్చిన ఎర్రన్నాయుడు. చంద్రబాబుకు అతి సన్నిహితుల్లో ఒకరుగా చలమణీ అయ్యారు. ఆయన రాజకీయ వారసునిగా అడుగుపెట్టిన తమ్ముడు అచ్చెన్నాయుడు కూడా సీనియర్ ఎమ్మెల్యేగా పార్టీలో ఉంటూ బాబుకు దగ్గరయ్యారు. గత క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఎర్రన్నాయుడు కొడుకు ఎంపీగా రెండవసారి నెగ్గారు. కుమార్తె భవాని మొదటిసారి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ప్రస్తుత సభలో అడుగుపెట్టారు. మొత్తానికి ఎర్రన్న కుటుంబం మొత్తం బాబుతోనే తమ రాజకీయ జీవితాన్ని పెనేవేసుకుని ముందుకు సాగడం ఓ చరిత్ర.
ఉప నేతగా అచ్చెన్న….
ఇక తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయినా కూడా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. బాబు సైతం ఆయన సీనియారిటీని గౌరవించి ఉప నేతగా నియమించారు. గత రెండు అసెంబ్లీ సెషన్లో టీడీపీ తరఫున వాడి వేడిగా అచ్చెన్నాయుడు తన వాణిని వినిపిస్తున్నారు. వైసీపీ సైతం అచ్చెన్నాయుడినే టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో అచ్చెన్న తన నోటి దురుసుతనంలో కొన్ని చిక్కులు కూడా పార్టీకి తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే ఇంతవరకూ అసెంబ్లీలో తన పక్కన ఉప నాయకుని హోదాలో అచ్చెన్నను కూర్చోబెట్టుకున్న చంద్రబాబు ఇపుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆహ్వానిస్తున్నారు. దీంతో అచ్చెన్నాయుడిపై బాబు వైఖరి మారిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
దూకుడుతో చేటేనా….
అచ్చెన్నాయుడు దూకుడు రాజకీయం అధికారంలో ఉన్నపుడు పనికివచ్చింది కానీ ప్రతిపక్షంలో దెబ్బతీస్తోందన్న మాట పార్టీలో వినిపిస్తోందంట. అచ్చెన్నాయుడు ఆవేశం టీడీపీకి మేలు చేయకపోగా కొన్ని సార్లు బూమరాంగ్ అవుతోందని అంటున్నారు. ఇక అచ్చెన్నాయుడు వల్ల టీడీపీ వ్యూహాలు కొన్ని సార్లు గతి తప్పి అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయని కూడా అంటున్నారు. మరో వైపు అచ్చెన్న ఈసారి గెలుపు వెనక వైసీపీ వెన్నుపోట్ల వీరుల శ్రమ తప్ప అచ్చెన్నాయుడు నిజమైన ప్రతిభ కాదన్న సత్యం కూడా బాబు గుర్తించారని, అయిదేళ్ళపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా జిల్లాలో పార్టీని బలోపేతం చేయలేదన్న విమర్శలు వున్నాయి. ఆఖరుకు అచ్చెన్నాయుడు వల్ల ఆయన అన్న కొడుకు రామ్మోహన్ కూడా ఎంపీగా గెలవడం కనాకష్టంగా మారిందని కూడా కధనాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అచ్చెన్న ప్రాధాన్యత టీడీపీలో ఏమైనా తగ్గిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.