ఆదిరెడ్డి పట్టును మరింత పెంచుకుంటున్నారా?

తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేద్ర‌మైన రాజ‌మ‌హేంద్రవ‌రం టీడీపీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారుతోంది. ఇక్కడ గ‌త కొన్నేళ్ల నుంచి రాజ‌కీయాలు చేసుకుంటూ వ‌స్తోన్న నేత‌ల‌కు జూనియ‌ర్ నేత [more]

Update: 2021-01-11 03:30 GMT

తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేద్ర‌మైన రాజ‌మ‌హేంద్రవ‌రం టీడీపీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారుతోంది. ఇక్కడ గ‌త కొన్నేళ్ల నుంచి రాజ‌కీయాలు చేసుకుంటూ వ‌స్తోన్న నేత‌ల‌కు జూనియ‌ర్ నేత చెక్ పెట్టేదిశ‌గా చాప‌కింద నీరులా పావులు క‌దుపుతూ దూసుకుపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడినా రాజ‌మ‌హేంద్రవ‌రం సిటీ, రూర‌ల్ రెండు నియోజ‌క‌ వ‌ర్గాల్లోనూ టీడీపీ విజ‌యం సాధించింది. సిటీ నుంచి ఆదిరెడ్డి అప్పారావు కోడ‌లు ఆదిరెడ్డి భ‌వానీ విజ‌యం సాధిస్తే, రూర‌ల్ నుంచి సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి గెలిచారు. ఒకే పార్టీలో ఉన్నా ఈ రెండు వ‌ర్గాల నేత‌ల మ‌ధ్య ఎప్పుడూ పొస‌గ‌దు. అధికారంలో ఉన‌ప్పటి నుంచే వారి మ‌ధ్య సంబంధాలు ఎడ‌మొఖం.. పెడ‌మొఖంగా ఉన్నాయి.ఇప్పుడు టీడీపీ ప్రతిప‌క్షంలో ఉన్నా వీరి మ‌ధ్య ఏ మాత్రం స‌ఖ్యత లేదు.

పార్టీలు మారి….

ఆదిరెడ్డి పార్టీలు మారి తిరిగి టీడీపీలోకి వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో సిటీ నుంచి ఆదిరెడ్డి అప్పారావు త‌న‌యుడు వాసు పోటీ చేయాల్సి ఉన్నా.. చంద్రబాబు మ‌హిళా కోటాలో వాసు భార్య భ‌వానీకి సీటు ఇవ్వగా.. ఆమె జ‌గ‌న్ ప్రభంజ‌నంలోనూ ఏకంగా 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇటు రూర‌ల్ లో ముక్కోణ‌పు పోటీ క‌లిసి వ‌చ్చి బుచ్చయ్య గెలిచారు. టీడీపీ అధికారంలో ఉండ‌గా మంత్రి ప‌ద‌వి రాలేద‌ని రుస‌రుస‌లాడిన ఆయ‌న్ను చంద్రబాబు ప్ర‌తిప‌క్షంగా ఉండ‌గా గుర్తిస్తున్నారు. బుచ్చయ్య ప్ర‌స్తుతం రూర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆయ‌న గ‌తంలో సిటీ ఎమ్మెల్యేగా ఐదుసార్లు ప‌ని చేయ‌డంతో ఆయ‌న‌కు రెండు చోట్లా బ‌లమైన అనుచ‌ర‌వ‌ర్గం ఉంది.

ఈ వర్గం మాత్రం…..

భ‌వానీ ఎప్పుడు అయితే సిటీ ఎమ్మెల్యే అయ్యారో అప్పటి నుంచే ఆదిరెడ్డి వాసు న‌గ‌రంలో త‌న వ‌ర్గాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వ‌స్తున్నారు. బుచ్చయ్య వ‌ర్గాన్ని పూర్తిగా సైడ్ చేస్తోన్నారు. ఇటు సిటీలో మంచి వ‌ర్గం ఉన్న బుచ్చయ్య సైతం త‌న వ‌ర్గాన్ని ప‌క్కన పెడితే తాను ఎక్కడ డౌన్ అవుతానో అని ఆయ‌న కూడా ఆదిరెడ్డి వ‌ర్గంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇటీవ‌ల బుచ్చయ్యను పోలిట్ బ్యూరోలోకి తీసుకున్న సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత‌లు అంతా బుచ్చయ్యను అభినందించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం క‌ష్టప‌డుతూ ఈ వ‌య‌స్సులో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉన్నందుకు ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ప‌లువురు నేత‌లు సూచించారు. అయితే ఆదిరెడ్డి ఫ్యామిలీతో పాటు వీళ్ల వ‌ర్గం మాత్రం అటు వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ట‌.

మాగంటి గ్యాంగ్ అడ్రస్ లేదే…?

బుచ్చయ్య వ‌ర్గాన్ని పూర్తిగా సైడ్ చేస్తూ సిటీని గ్రిప్‌లోకి తెచ్చుకుంటోన్న వాసు ఇక్కడ ఉన్న గ‌త రెండు ద‌శాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న మాజీ ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ వ‌ర్గాన్ని కూడా పూర్తిగా త‌న కంట్రోల్ లోకి తెచ్చుకుంటోన్న ప‌రిస్థితి. ముర‌ళీ మోహ‌న్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా ఓడిన ఆయ‌న కోడ‌లు రూపాదేవి సైతం యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో మాగంటి వ‌ర్గం సైతం సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ భ‌విష్యత్తు కోసం ఆదిరెడ్డికి ద‌గ్గర‌వ్వక త‌ప్పని ప‌రిస్థితి. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టిక్కెట్లు రావాల‌న్నా.. ఇత‌ర ప‌నులు జ‌ర‌గాల‌న్నా ఆదిరెడ్డే ఇప్పుడు వాళ్లకు దిక్కు. దీంతో వాళ్లను కూడా ఆదిరెడ్డి ఏదోలా త‌న వైపున‌కు తిప్పుకుంటున్నారు. చివ‌ర‌కు ఆదిరెడ్డి దూకుడు మ‌రీ ఎక్కువుగా ఉండ‌డంతో బుచ్చయ్య సైతం ఏం చేయాలో తెలియ‌క‌.. ఇటీవ‌ల త‌న రాజ‌కీయ వార‌సుడిగా త‌న సోద‌రుడి కుమారుడిని తెర‌మీద‌కు తీసుకు వ‌స్తోన్న ప‌రిస్థితి. ఏదేమైనా రాజ‌మండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు చ‌క‌చ‌కా చాప‌కింద స్కెచ్‌లు వేస్తూ దూసుకుపోతున్నది నిజం.

Tags:    

Similar News