కమ్మోళ్ల డామినేషన్ పార్టీకి దెబ్బేస్తోందా ?
టీడీపీలో కమ్మ నేతలు, కార్యకర్తల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఆ పార్టీ అధికారంలో ఉంటే ఇక కమ్మ సామాజిక వర్గం నేతల హంగామా, కోలాహాలం [more]
;
టీడీపీలో కమ్మ నేతలు, కార్యకర్తల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఆ పార్టీ అధికారంలో ఉంటే ఇక కమ్మ సామాజిక వర్గం నేతల హంగామా, కోలాహాలం [more]
టీడీపీలో కమ్మ నేతలు, కార్యకర్తల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఆ పార్టీ అధికారంలో ఉంటే ఇక కమ్మ సామాజిక వర్గం నేతల హంగామా, కోలాహాలం మామూలుగా ఉండదు. గత ఐదేళ్లలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కమ్మ డామినేషనే పార్టీ కొంపముంచింది. చివరకు ఇదే అటు జగన్‌కు ప్రధాన అస్త్రంగా మారింది. పోనీ పార్టీ ఓడిపోయాక అయినా ఈ వర్గం నేతల్లో మార్పు వచ్చిందా ? అంటే లేనే లేదు. ఇప్పుడు ఘోరంగా ఓడిపోయినా సరే పార్టీ పదవుల కోసం ఈ వర్గం నేతలే కొట్టుకుంటున్నారు. పార్టీ పదవుల్లోనూ తమ పెత్తనమే ఉండాలంటూ.. మాకే పదవులు.. మాకే పదవులు అని భీష్మించుకుంటున్నారు. చివరకు పార్టీలో ఇతర బీసీ, ఎస్సీ వర్గాల వారు సైతం నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కమ్మ వర్గం నేతలు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ఈ రెండు జిల్లాల్లో…
ఇక కృష్ణా – గుంటూరు జిల్లాల్లో కమ్మ నేతల దూకుడు ఎంతలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అక్కడ ఓ మండల స్థాయి లీడరే కాదు… గ్రామస్థాయి లీడర్ సైతం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని సైతం గజగజలాడించేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు, బీసీ ఇన్‌చార్జ్‌లు ఉన్న చోట ఇప్పటికీ కమ్మ నేతల డామినేషన్‌తో పార్టీ భ్రష్టు పట్టిపోతోంది. నూజివీడులో బీసీ – యాదవ వర్గానికి చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఓడిపోయారు. ఈ సారి ఆయన ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. అయితే అక్కడ కమ్మ నేతలు మాత్రం రెండు సార్లు ఓడిన ముద్దరబోయినను తప్పించి కమ్మలకు ఇన్‌చార్జ్ ఇవ్వాలని లేదా మరో వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారు.
కైకలూరులో…..
ఇక కైకలూరులో మాజీ ఎమ్మెల్యే, బీసీ – మత్స్యకార వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అసలు గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటి నుంచి ఆయన బయటకు వచ్చి స్వేచ్ఛగా పార్టీ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఉంది. కమ్మవర్గం నేతలు డామినేట్ చేస్తున్నారు. చిన్న చిన్న పదవులు కోసం కూడా ఈ వర్గం అరిచి గీ పెట్టేయడంతో వెంకటరమణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా ? వద్దా ? అన్న డైలమాలో ఉన్నారు.
కేశినేని నాని వ్యవహారంతో….
ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని కాళ్లు, వేళ్లు పెట్టేస్తుండడంతోనే అక్కడ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు విసిగిపోయారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా కూడా ఇంకా వాళ్ల తీరు మారలేదు. సెంట్రల్ లోనూ ఎంపీ నాని తన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుండడంతో ఈ కమ్మ నేతలు తనను ఎక్కడ డామినేషన్ చేస్తారో ? అనే బొండా ఉమా సైతం ఎంపీపై రగులుతున్నారు. ఇక తిరువూరులో గతంలో స్వామిదాస్‌ను ఇదే వర్గం నేతలు ముప్పు తిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించి మూడు సార్లు ఓడించారు. మొన్న జవహర్‌ను వీళ్లే ఇబ్బంది పెట్టారు. ఇక జగ్గయ్యపేటలో కూడా వీళ్ల డామినేషన్ ఉన్నా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. మరి వీరు ఎప్పుడు పారతారో ? పార్టీ ఎప్పటికి బాగుపడుతుందో ? కాలానికే ఎరుక ?