పలమనేరు టీడీపీ పడక.. రీజనేంటి..?
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందనే [more]
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందనే [more]
మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అమర్‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014లో వైసీపీ తరఫున గెలిచిన అమర్ నాథ్.. తర్వాత టీడీపీలో చేరిపోయారు. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పైనే ఆయన పోటీ చేశారు. ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి పెద్దగా దూకుడు చూపించలేక పోతున్నారు. కీలక నేతలు ఫోన్లు చేసినా.. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించినా కూడా ఆయన రావడం లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన అమర్‌నాథ్ రెడ్డి మంత్రి పదవి ఆఫర్‌తో వైసీపీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో రాజకీయాలతో సంబంధం లేని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో ఓడిపోయారు.
ఎడ్జ్ ఉన్నప్పటికీ…..
ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండలేక పోతున్నారు. తన నియోజకవర్గంలో కొన్నాళ్ల కిందట ఓ ఎస్సీ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని.. ఆరోపించిన అమర్‌నాథ్ రెడ్డి ఈ విషయంలో ఒకింత హల్‌చల్ చేశారు. తర్వాత మళ్లీ .. సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి ఇక్కడ పార్టీకి మంచి ఎడ్జ్ ఉంది. కార్యకర్తలు కూడా బాగానే ఉన్నారు. కానీ, దీనిని వినియోగించుకుని దూకుడు చూపించడంలో మాత్రం మాజీ మంత్రిగా అమర్‌నాథ్ రెడ్డి విఫలమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
క్యాడర్ వెళ్లిపోతున్నా…..
పార్టీ కేడర్ యాక్టివ్‌గా ఉన్నా వాళ్లకు భరోసా కల్పించడంలో ఈ మాజీ మంత్రి చేతులు ఎత్తేస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో గెలుపు ఓటములు మామూలే. పైగా ఎంతో సీనియర్ అయిన అమర్‌నాథ్ రెడ్డికి ఈ విషయాలు తెలియనిది కాదు. అయినా కూడా ఆయన తన పంథాను వీడడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇక, వైసీపీ నాయకుడు, యువనేత వెంకటే గౌడ దూకుడు పెంచారు. ఎక్కడ అవకాశం ఇస్తే.. అక్కడ టీడీపీ నేతలను పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ కార్యకర్తలను పార్టీలోకి తీసుకున్నారు.
యాక్టివ్ గా లేకపోవడంతో….
ఇక, కీలక నేతలను కూడా లాగేసుకుంటే.. పార్టీకి ప్రధానంగా అండగా ఉంటున్న వారు దూరమయ్యే పరిస్థితి ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అయినా కూడా అమర్ నాథ్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారు. పైగా చిత్తూరు జిల్లాకు కింగ్‌గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకటే గౌడకు ఫుల్‌గా సపోర్ట్ చేస్తూ అమర్‌నాథ్ రెడ్డి మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదన్న పంతంతో ఉన్నారు. ఈ పరిణామాలన్ని చూస్తే అమర్‌నాథ్ రెడ్డి ప్రజల్లో యాక్టివ్ కాకపోతే ఆయన రాజకీయంగా నిలదొక్కుకునే పరిస్థితులు కనపడడం లేదు.