అనిల్‌కు చెక్ పెట్టబోతున్నారా?

జగన్ కేబినెట్‌లో ఫైర్ బ్రాండ్ మంత్రులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో పార్టీ కోసం నిలబడుతూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టే మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా [more]

Update: 2021-06-23 08:00 GMT

జగన్ కేబినెట్‌లో ఫైర్ బ్రాండ్ మంత్రులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో పార్టీ కోసం నిలబడుతూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టే మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. నెల్లూరు సిటీ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ కేబినెట్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్‌ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తుంటారు. సందర్భాన్ని బట్టి పరుష పదజాలం సైతం వాడుతూ, ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుంటారు. జ‌గ‌న్ కేబినెట్లో ఉన్న ఫైర్ బ్రాండ్ మంత్రుల్లో అనిల్ కూడా ఒక‌రు. జ‌గ‌న్‌పై ప్రత్యర్థి పార్టీ నేత‌లు ఈగ కూడా వాల‌నివ్వకుండా అనిల్ కుమార్ యాదవ్ ఎదురు దాడికి దిగుతుంటారు.

బలంగా ఉన్నప్పటికీ…?

ఇలా ప్రత్యర్ధులపై దూకుడు ప్రదర్శించే అనిల్ కుమార్ యాదవ్ తన సొంత నియోయజకవర్గంలో దూకుడుగా ఉన్నారా? అంటే…ఉన్నారనే చెప్పొచ్చు. ఓ వైపు మంత్రిగానే ఉంటూ, మరోవైపు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సేవలు చేస్తున్నారు. మంత్రిగా ఉండటంతో నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు మరింత అడ్వాంటేజ్ కానున్నాయి. ఇలా నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ మరింత బలం పెంచుకుంటున్నారు. 2014లోనే భారీ మెజార్టీతో గెలిచి స‌త్తా చాటారు. మొత్తంగా ద‌శాబ్దంన్నర కాలంగా అనిల్ ఇక్కడ పాతుకుపోయారు.

బలమైన నేత కావాలని….?

ఇంత బలంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు చెక్ పెట్టాలంటే ప్రత్యర్ధి టీడీపీ నుంచి అంతే బలమైన నాయకుడు కావాలి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడు ఉండాలి. అలాగే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి. ఇక ఈ విషయాల్లో ఎలాంటి లోటు చేయకుండా టీడీపీ ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దూసుకెళ్తున్నారనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ మీద మాజీ మంత్రి నారాయణ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగారు. దీంతో చంద్రబాబు, కోటంరెడ్డిని రంగంలోకి దించారు. బాలయ్యతో సన్నిహితంగా ఉండే కోటంరెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దూకుడు కనబరుస్తున్నారు.

దూకుడుగా వ్యవహరిస్తూ…?

జిల్లాలో మిగతా టీడీపీ నాయకులు పెద్దగా నోరువిప్పకపోయినా సరే, కోటంరెడ్డి మాత్రం వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. అస‌లు జిల్లాలో టీడీపీకి అసెంబ్లీలో ప్రాధినిత్యమే లేదు. ఓడిపోయాక ఆరేడుగురు ఇన్‌చార్జ్‌లు అస‌లు ప్రజ‌ల్లోకి వెళ్లడం లేదు. వీరంద‌రికి కంటే కూడా కొత్తగా ఇన్‌చార్జ్‌గా వ‌చ్చిన కోటంరెడ్డి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వ్యవ‌హ‌రిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోనే సమస్యలపై పోరాటం చేస్తూ, మంత్రి అనిల్‌పై విమర్శలు చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటం, తాను మంత్రిగా ఉండటంఅనిల్ కుమార్ యాదవ్ కు కలిసొచ్చే అంశం. మాజీ మంత్రి నారాయ‌ణ కంటే కూడా కోటంరెడ్డే అనిల్‌కు స‌రైన ప్రత్యర్థి అన్న టాక్ అయితే ఆయ‌న ఇప్పటికే సొంతం చేసుకున్నారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోటంరెడ్డి పై చేయి సాధిస్తారా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News