Anil kumar : అనిల్ కు కష‌్టం ఆ రూపంలో రానుందా?

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కష్టాలు తప్పవా? వచ్చే ఎన్నికలు ఆయనకు చుక్కలు చూపించనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఈసారి గెలుపు అనిల్ కుమార్ యాదవ్ [more]

Update: 2021-11-06 06:30 GMT

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కష్టాలు తప్పవా? వచ్చే ఎన్నికలు ఆయనకు చుక్కలు చూపించనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఈసారి గెలుపు అనిల్ కుమార్ యాదవ్ కు అంత సులువు కాదన్నది వాస్తవం. ఇక్కడ సమీకరణాలు తీసుకుంటే ఆయనకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురుకానుంది. నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ రెండు సార్లు విజయం సాధించారు.

మూడోసారి గెలిచేందుకు….

మూడోసారి గెలిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 2009లో తొలిసారి నెల్లూరు పట్టణ నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఇక్క ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. ఇక్కడ మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు. అనిల్ కూడా మెగా అభిమాని. గత ఎన్నికల్లో జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేయడం అనిల్ కుమార్ యాదవ్ కు కలసి వచ్చిందనే చెప్పాలి.

ఆ కాంబినేషన్ అయితే?

ఈసారి జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ కు గెలుపు ఆషామాషీ కాదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకూ ఇక్కడ గెలవకపోయినప్పటికీ పటిష్టమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. సిటీ కావడంతో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. ద్విముఖ పోటీ అయితే ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే చెప్పాలి.

ఆనం వర్గం నుంచి….

మరోవైపు ఆనం వర్గీయులు కూడా అనిల్ కుమార్ యాదవ్ కు సహకరించే అవకాశాలు లేవు. ఆనం ఫ్యామిలీ ఈయనను శత్రువుగానే చూస్తుంది. నెల్లూరు పట్టణంలో ఆనం ఫ్యామిలీకి కూడా ఓటు బ్యాంకు ఉంది. ఆనం ఈసారి అనిల్ కుమార్ యాదవ్ కు సహకరిస్తారనుకోవడం భ్రమే అవుతుందని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. సహజంగా మంత్రిగా పనిచేసిన ఆయనపై వ్యక్తిగత వ్యతిరేకత కూడా ఉంటుంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ కు హ్యాట్రిక్ విజయం అంత సులువు కాదన్నది వాస్తవం.

Tags:    

Similar News