టీడీపీ పథకం సెంటిమెంట్ అయితే.. వైసీపీకి కష్టమేనా?
ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ఏ పార్టీలకైనా ప్రజలను మచ్చిక చేసుకోవాలన్నదే ప్రధాన కోరిక. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ప్రజలతో కనెక్ట్ కావడం తప్పనిసరి. దీనికి గాను [more]
ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ఏ పార్టీలకైనా ప్రజలను మచ్చిక చేసుకోవాలన్నదే ప్రధాన కోరిక. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ప్రజలతో కనెక్ట్ కావడం తప్పనిసరి. దీనికి గాను [more]
ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ఏ పార్టీలకైనా ప్రజలను మచ్చిక చేసుకోవాలన్నదే ప్రధాన కోరిక. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ప్రజలతో కనెక్ట్ కావడం తప్పనిసరి. దీనికి గాను అధికారంలో ఉండే పార్టీలు అనుసరించే విధానాలు అనేకం ఉంటాయి. అయితే, అవన్నీ.. పథకాల రూపంలోనో.. సంక్షేమం రూపంలోనో ఉన్నప్పటికీ.. అన్నీ కనెక్ట్ అవుతాయా ? అందరికీ కనెక్ట్ అవుతాయా ? అంటే కష్టమే. ఎన్నెన్నో పథకాలు పెట్టినా.. సామాన్యుల నుంచి మేధావుల వరకు ప్రభుత్వానికి కనెక్ట్ చేసేవి చాలా చాలా తక్కువే ఉంటాయి.
ఎన్టీఆర్ హయాంలో….
అలా.. ప్రభుత్వాన్ని-ప్రజలకు కనెక్ట్ చేసిన పథకాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ చెప్పుకొనే పథకం రెండు రూపాయలకే కిలో బియ్యం. దీనిని అన్నగారు ఎన్టీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేశారు. ఇది వరుసగా రెండోసారి కూడా అన్నగారిని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇక, తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చినా.. ఈ తరహా పథకాలు అమలు కాలేదు. జన్మభూమి కార్యక్రమం వంటివి పెట్టినా.. దీనివల్ల ప్రజలకు నేరుగా ఒనగూరిన లబ్ధి అంటూ ఏమీ లేదు. కానీ, చాన్నాళ్ల తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం అలనాడు ఎన్టీఆర్ పెట్టిన పథకాన్ని మరిపించింది.
ఆరోగ్యశ్రీతో వైఎస్….
ప్రభుత్వాన్ని.. నేరుగా ప్రజలకు కనెక్ట్ చేయడమే కాకుండా వైఎస్‌ను ఇంటింటి ఇలవేల్పు చేసింది. ఉన్నవారు.. లేనివారు కూడా ఏదో ఒక రూపంలో ఈ పథకం కింద లబ్ధి పొందారు. కూలి చేసుకునేవారికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఈ పథకం కారణంగానే రెండోసారి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ.. వైఎస్‌ను అధికారంలోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఎన్నికల సమయంలో వైఎస్ తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్.. ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇది బాగానే వర్కవుట్ అయింది. అధికారంలోకి రాగానే ఈ పథకానికి మళ్లీ పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందించారు కూడా.
బాబు హయాంలోనూ….
ఇక, ఇంత రేంజ్‌లో కాకపోయినప్పటికీ.. గడిచిన ఏడాదిన్ర కిందటి వరకు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు కూడా చివరి రోజుల్లో అంటే 2019 ఎన్నికలకు 11 మాసాల ముందు అన్న క్యాంటీన్ల పథకాన్ని తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ పథకాన్ని ప్రజల్లో అమలు చేశారు. రూ.5కే టిఫిన్, రూ.5కే మధ్యాహ్న భోజనం, రూ.5కే రాత్రిపూట భోజనం లేదా టిఫిన్ అందించే ఈ కార్యక్రమం కూడా భారీ ఎత్తున ప్రజలకు చేరువైందనే చెప్పాలి. అయితే, ఆయన కనుక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీనిని ప్రారంభించి ఉంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఆయనకు కనిపించేది.
తిరిగి తెరవాలంటూ…
ఇక, ఇప్పుడు జగన్ సర్కారు దీనిని పక్కన పెట్టింది. కానీ, ప్రజల్లో ఈ పథకంపై సెంటిమెంట్ అలానే ఉంది. తాజాగా జగన్ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా తెప్పించుకున్న సమాచారంలో అన్నక్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని 85 శాతం మంది ప్రజలు కోరుతున్నారని తెలిసింది. దీనికి సెంటిమెంటు ఎక్కువగా కూడా ఉందని అర్ధమైంది. దీంతో ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడంపై జగన్ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. వచ్చే ఎన్నికల్లో దీనికి ప్రాధాన్యం ఉంటుందని కూడా భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.