వీళ్లను లాగేస్తారు స‌రే…. జగన్ కు లాభ‌మేంటో?

అధికార వైసీపీపై మ‌రో కీల‌క చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇటు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చల‌తో పాటు అటు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొద‌ల‌య్యాయి. ప్రతిప‌క్ష టీడీపీ [more]

Update: 2020-06-16 02:00 GMT

అధికార వైసీపీపై మ‌రో కీల‌క చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇటు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చల‌తో పాటు అటు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొద‌ల‌య్యాయి. ప్రతిప‌క్ష టీడీపీ నేత‌ల‌ను వైసీపీలో చేర్చుకోవ‌డాన్ని సోష‌ల్ మీడియా జ‌నాలు తీవ్రంగానే ప‌రిగ‌ణిస్తున్నారు. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీ ఇలా చేయ‌డం స‌రైన విధాన‌మేనా ? అన్నది కీల‌క ప్రశ్న. కొంద‌రు త‌మంత‌ట తాముగా పార్టీ మారి.. వ‌చ్చి వైసీపీలో చేరితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దీనికి భిన్నంగా ప‌రిస్థితి మారితే.. ఇప్పుడు ఇదే చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో వైసీపీ నుంచి నాయ‌కుల‌ను లాగేసింది. దీంతో ల‌బోదిబోమ‌న్న నాయ‌కులు.. ఇప్పుడు అదే పంథాను ఎందుకు అనుస‌రిస్తున్నారు? దీనికి ఉన్న రీజ‌న్ ఏంటి? అనేది కీల‌కంగా మారింది.

విమర్శలు తగ్గుతాయా?

ఈ క్రమంలోనే రెండు ప్రధాన కార‌ణాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఒక‌టి.. టీడీపీకి నేత‌లు లేకుండా చేస్తే.. అధికార పార్టీని విమ‌ర్శించే వారు త‌గ్గుతార‌ని వైసీపీ భావిస్తోందా ? లేక‌.. టీడీపీ అడ్రస్ లేకుండా పోతుంద‌ని అధికార పార్టీ నేత‌లు అనుకుంటున్నారా ? అనేది చ‌ర్చలో కీల‌కంగా మారిన విష‌యం. ఇదే నిజ‌మ‌ని భావిస్తే.. గతంలో టీడీపీ వైసీపీ నేత‌ల‌ను లాగేసిన‌ప్పుడు.. దాదాపు ఆ పార్టీ కనుమ‌రుగు అవ్వాలి క‌దా ? అధికారంలోకి ఎలా వ‌చ్చింది ? పోనీ.. టీడీపీ నేత‌ల‌ను లాగేస్తే.. విమ‌ర్శించేవారు ఉండ‌రు క‌దా ? అంటే.. సొంత పార్టీ నేత‌లే ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. వీరిని నియంత్రించ‌డమే క‌ష్టమ‌వుతున్న ప‌రిస్థితిని మ‌నం గ‌మ‌నిస్తున్నాం. అలాంట‌ప్పుడు పొరుగు పార్టీ నేత‌ల‌ను లాగేయ‌డం వ‌ల్ల విమ‌ర్శలు త‌గ్గుతాయ‌ని అనుకోవ‌డం స‌రైన విధానం కాద‌న్నది రాజ‌కీయ మేథావుల‌ అభిప్రాయం.

కుంపట్లు ఖాయం….

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. టీడీపీ నేత‌ల‌ను లాగేయ‌డం వ‌ల్ల.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీలోనే రెండు కుంప‌ట్లు పెరిగే అవ కాశం ఉంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక టీడీపీ నేత‌లు వైసీపీలోకి వ‌చ్చిన రామ‌చంద్రాపురం, చీరాల‌, జమ్మల‌మ‌డుగు లాంటి చోట్ల ఇప్పటికే కుంప‌ట్లు మొద‌ల‌య్యాయి. తెలుగుదేశం నుంచి ఎంత మంది నేత‌లు వ‌స్తే ఇక్కడ అన్ని కుంపట్లు ఉంటాయ‌న్నది ఓపెన్ సీక్రెట్‌. ఇప్పటికిప్పుడు వైసీపీ ఇలా టీడీపీ నేత‌ల‌కు వ‌ల విసిరినా.. వారి వారి అవ‌కాశం కోసం.. వ్యాపారాల కోసం.. ఆయా నేత‌లు పార్టీ మారిన‌ప్పటికీ.. ఇలా మారే ల‌క్షణం ఉన్న నాయ‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ సొంత గూటికి చేరిపోర‌నేది ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు స‌మాధానం లేదు.

పదవులు ఎలా వస్తాయి?

అంతేకాదు.. ఒక వేళ పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఎంత మందికి ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సీనియ‌ర్లు త‌ప్పుకొని త‌మ టికెట్లను త్యాగం చేశారు. అలాంటి వారికే ఇప్పుడు దిక్కులేకుండా పోయింది. మ‌రో వైపు మండ‌లి ర‌ద్దు కాబోతుంది. మ‌రి ఇప్పుడు కొత్తగా వ‌చ్చేవారికి ఒన‌గూరే ప్రయోజ‌నం ఏమీ ఉండ‌దు. పైగా పార్టీలో అసంతృప్తి పెర‌గ‌డ‌మే త‌ప్ప అని ముక్తాయిస్తున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు. మ‌రి వైసీపీలో అంత‌ర్మథ‌నం జ‌ర‌గ‌డం లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న.

Tags:    

Similar News