ఆపరేషన్ అచ్చెన్న….మొదలయిందిగా ?

అచ్చెన్నాయుడు. మాజీ మంత్రి. బలమైన బీసీ నేత. శ్రీకాకుళం జిల్లా నుంచి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న కింజరాపు వారసుడు. అన్న ఎర్రన్నాయుడు రాజకీయాలు వేరు, ఆయన‌ [more]

Update: 2020-08-10 13:30 GMT

అచ్చెన్నాయుడు. మాజీ మంత్రి. బలమైన బీసీ నేత. శ్రీకాకుళం జిల్లా నుంచి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న కింజరాపు వారసుడు. అన్న ఎర్రన్నాయుడు రాజకీయాలు వేరు, ఆయన‌ వ్యూహాల్లో దూకుడు చూపించేవారు. కానీ తమ్ముడు అచ్చెన్నాయుడు మాత్రం నోరు పెట్టుకునే బతికేస్తూ వచ్చారు. అందుకే ఆయన చంద్రబాబుకు బాగా నచ్చారు. ఎర్రన్నను ఢిల్లీ రాజకీయాల్లో బాగా వాడుకున్న బాబు అచ్చెన్నను ఆయుధంగా చేసుకుని రాజకీయ‌ ప్రత్యర్ధుల మీదకు ప్రయోగిస్తున్నారు. నిజానికి అచ్చెన్నాయుడు బలమైన ప్రతిపక్ష నేతగా జగన్ గత అసెంబ్లీలో ఉన్నపుడు అడ్డంగా బ్రేక్ వేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డారు. అచ్చెన్న జగన్ మీద వాడిన భాష, చేసిన సవాళ్ళూ కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు మరచిపోలేరు.

ఓడాల్సిందే :

జగన్ 2019 ఎన్నికల్లో తాను ఓడించాలనుకున్న వారిని అందరినీ ఓడించేశాడు. చంద్రబాబును కేవలం 23 సీట్లకే పరిమితం చేసి ఘోర పరాభవం ఏంటో తొలిసారిగా రుచి చూపించాడు, కానీ తనను మానసికంగా వేధించిన అచ్చెన్నాయుడుని మాత్రం ఓడించలేకపోయారు. దానికి కారణం ధర్మాన ప్రసాదరావు అని జగన్ కి ఆ తరువాతనే సమాచారం అందింది. దాంతో అచ్చెన్నాయుడి మీద కక్ష ధర్మాన మీదకు మళ్ళింది. వట్టి ఎమ్మెల్యేగా ధర్మాన మిగలడానికి అచ్చెన్న కారణమని తెలిసి ధర్మాన అనుచర వర్గం కుములుతోంది. సరే ఈ సంగతి ఇలా ఉంటే అచ్చెన్నను 2024 ఎన్నికల్లోనైనా సరే ఓడించాల్సిందే అని వైసీపీ గట్టిగా డిసైడ్ అయిపోయింది.

దువ్వాడే ఎమ్మెల్యే…..

ఇక 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు. ఆయనను ఏరి కోరి తెచ్చి మరీ టెక్కలి ఇంచార్జిగా జగన్ చేశారు. దువ్వాడనే టెక్కలి ఎమ్మెల్యేగా జగన్ ట్రీట్ చేస్తున్నారు. ఆయనే ఇకపైన నాలుగేళ్ళూ అక్కడి పనులు చక్కబెట్టాలి. అభివృధ్ధి కార్యక్రమాలు చూడాలి. కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడను దువ్వడం ద్వారా సామాజిక సమీకరణను కూడా జగన్ సరిచూశారు. అక్కడ కాళింగుల బలం ఉన్నా కూడా అచ్చెన్నాయుడు గెలవడం పట్ల ఆ వర్గం రగులుతోంది. దాంతో వారిలో కసి రేపి మరీ అచ్చెన్నాయుడు ఓటమిని జగన్ ముందే స్కెచ్ గీసి ఉంచారు.

లాగేస్తున్నారు…..

ఇక అచ్చెన్నాయుడు ఆరు నెలలుగా టెక్కలి టీడీపీ క్యాడర్ కి అందుబాటులో లేకుండా ఉన్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్ళు విశాఖలో గడిపిన అచ్చెన్నాయుడును వైసీపీ సర్కార్ ఏసీబీ కేసులు పెట్టి మరీ రెండు నెలలుగా జైలుపాలు చేసి ఉంచింది. దాంతో క్యాడర్ తల్లడిల్లుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో బలమైన టీడీపీ నాయకులను వైసీపీ వైపుగా దువ్వాడ శ్రీనివాస్ లాగేస్తున్నారు. కండువాల కార్యక్రమం ఇపుడు టెక్కలిలో జోరుగా సాగుతోంది. దానికి తోడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి మరీ తానే ఎమ్మెల్యేగా దువ్వాడ ఫోకస్ అవుతున్నారు. ఈ పరిణామాలు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు గెలుపునకు రెడ్ మార్క్ పడడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి అచ్చెన్న ఏ విధంగా కొత్త వ్యూహాలు పన్నుతారో.

Tags:    

Similar News