అయిదేళ్లకు గాని అరవింద్ కు అర్థం కాలేదట

అరవింద్ కేజ్రీవాల్ ఫక్తు రాజకీయ నాయకుడేం కాదు. ఆయనకు రాజకీయ వ్యూహాలు తెలియవు. ఐఆర్ఎస్ అధికారిగా ఉండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అరవింద్ కేజ్రీవాల్ కు [more]

Update: 2020-03-06 17:30 GMT

అరవింద్ కేజ్రీవాల్ ఫక్తు రాజకీయ నాయకుడేం కాదు. ఆయనకు రాజకీయ వ్యూహాలు తెలియవు. ఐఆర్ఎస్ అధికారిగా ఉండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అరవింద్ కేజ్రీవాల్ కు రాజకీయాలు అర్థం కావడానికి ఐదేళ్లు పట్టిందంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ముక్కుసూటి మనిషి. మృదుస్వభావి. ప్రజలకు మంచి చేద్దామనే తపన తప్ప మరో ఆలోచన ఆయనకు ఉండదు. అదే ఆయన వరస విజయాలకు కారణమని చెప్పక తప్పదు.

మూడు సార్లు ముఖ్యమంత్రిగా……

ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మెజారిటీ లేదు. దీంతో ఆయన తిరిగి 2013లో ఎన్నికలకువెళ్లారు. 70 స్థానాలకు 67 స్థానాలను సాధించడంతో కేజ్రీవాల్ ఇక తనకు తిరుగులేదనుకున్నారు. ప్రజలు తనకు అండగా ఉన్నారని భావించి కొంత దూకుడుగానే వెళ్లారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేని కారణంగా ఏ పని చేద్దామన్నా అడ్డంకులే వస్తున్నాయి.

ఏమీ చేయలేమని……

ముఖ్యంగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతిలో తాము బందీమన్న విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఆలస్యంగా గ్రహించారు. ఐదేళ్లపాటు వివాదాాలు, విమర్శలతో నే కాలాన్ని నెట్టుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో కాలు దువ్వారు. దీంతో ఢిల్లీలో ఏం చేయాలన్నా, ఏ నిర్ణయాన్ని అమలు చేయాలనుకున్నా కేజ్రీవాల్ కు సాధ్యం కాలేదు. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ కు ప్రజలు పట్టం కట్టారు. మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే అరవింద్ మారిపోయినట్లు కన్పించింది.

మోదీ, షాలతో భేటీ….

ప్రమాణస్వీకార సభలోనే తాను కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుని ఢిల్లీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అంతేకాదు ఢిల్లీ అల్లర్లపై కూడా ఆయన ఆచితూచి స్పందించారు. ఎప్పటిలాగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడలేదు. అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజాగా ప్రధాని మోడీతో కూడా అరవింద్ సమావేశమై ఢిల్లీ అలర్లతో పాటు, అభివృద్ధి పైనా చర్చించారు. అల్లర్లను అణిచివేయడంలో ఢిల్లీ పోలీసుల పనితీరును కూడా అరవింద్ కేజ్రీవాల్ మెచ్చుకున్నారు. మొత్తం మీద ఢిల్లీలో కేంద్రం సైగ లేనిదే ఏమీ చేయలేమని అరవింద్ కేజ్రీవాల్ కు ఐదేళ్ల తర్వాత కానీ అర్థం కాలేదన్న మాట.

Tags:    

Similar News