Andhra : వైసీపీలో మరో జవహర్… టిక్కెట్ లేదట

రాజకీయాల్లో కులాలు, మతాలదే ప్రాధాన్యం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఇది మరికొంత ఎక్కువగా మనకు కనపడుతుంది. తెలంగాణలో మాదిరి ఏపీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు [more]

Update: 2021-10-19 03:30 GMT

రాజకీయాల్లో కులాలు, మతాలదే ప్రాధాన్యం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఇది మరికొంత ఎక్కువగా మనకు కనపడుతుంది. తెలంగాణలో మాదిరి ఏపీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు స్వతంత్రత ఉండదు. ఆ నియోజకవర్గంలోని అగ్ర కులాలకు చెందిన నేతలపైనే ఆధారపడి ఉంటారు. తమ మాట వినకపోతే వారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారు. లేదా టిక్కెట్ ఇవ్వకుండానైనా చేస్తారు. దీనికి టీడీపీ, వైసీపీలు ఏవీ అతీతం కాదు.

ఈసారి ఎన్నికల్లో….

వచ్చే ఎన్నికల్లో నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ కు టిక్కెట్ దక్కడం అనుమానంగానే కన్పిస్తుంది. ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జి సిద్దార్థ్ రెడ్డికి నచ్చడం లేదు. రెండు వర్గాలుగా విడిపోయి పార్టీని నష్ట పర్చే కార్యక్రమం చేస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్ గా ఇచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువయింది. ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరు కావడం లేదు.

సిద్దార్థ రెడ్డి పట్టుబట్టి….

వచ్చే ఎన్నికల్లో ఆర్థర్ కు టిక్కెట్ ఇస్తే తాను సహకరించేది లేదని సిద్దార్థ రెడ్డి తెగేసి చెబుతున్నారు. తాను సూచించిన మరో అభ్యర్థికి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ ను బట్టి ఆర్థర్ కు వచ్చే ఎన్నికల్లో తిరిగి టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అక్కడ బైరెడ్డి వల్లనే గెలుపు సాధ్యమవుతుందని నమ్ముతుంది. అందుకే కొత్త నేత కోసం వైసీపీ అధినాయకత్వం కూడా వెతుకుతుందంటున్నారు.

టీడీపీలో జవహర్ కూడా….

గతంలో తెలుగుదేశం హయాంలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలోనూ జవహర్ కు సీటు ఇస్తే ఒప్పకోమని చంద్రబాబుకు చెప్పి అక్కడ కమ్మ సామాజికవర్గం నేతలు సాధించుకున్నారు. చంద్రబాబు వారికి తలొగ్గి జవహర్ కు కొవ్వూరు టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఆయనను తిరువూరుకు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థర్ పరిస్థితి కూడా అలాగే తయారయింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పట్టుబడుతుండటంతో ఆయనను నియోజకవర్గం మార్చడమో, వేరే వారికి అక్కడ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News