రచ్చకు రంగం సిద్ధమయిందిగా …?

కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు ముందు అధికార వైసిపి టిడిపి ని పూర్తిగా సైడ్ ట్రాక్ చేసే వ్యూహం పన్నిందా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో [more]

Update: 2020-06-16 03:30 GMT

కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు ముందు అధికార వైసిపి టిడిపి ని పూర్తిగా సైడ్ ట్రాక్ చేసే వ్యూహం పన్నిందా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అమలౌతున్న సంక్షేమ పథకాలు, వాటికి సమకూర్చే నిధులు, ఆర్ధిక స్థితి గతులు, ఇసుక సమస్య, రోడ్లు, మౌలిక సదుపాయాలు, రాజధాని తరలింపు వ్యవహారం ఇలా అనేక సమస్యలను ప్రధాన విపక్షం అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలిసి ఉంది. ఇవి పరిమిత చర్చకు వచ్చేలా చేసి అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకరరెడ్డి అరెస్ట్ ల వంటి వ్యవహారాలతో ప్రధాన పక్షాన్ని పక్కదారి పట్టించేందుకు అధికారపక్షం పక్కా స్కెచ్ గీసిందంటున్నారు. అచ్చెన్న , జెసి వంటి వారి అరెస్ట్ వ్యవహారాలపై గట్టిగా గళం విప్పి గందరగోళం చేయకపోతే పార్టీలో ఇతర నేతల్లో అసంతృప్తి అసహనం పెల్లుబికుతాయి.

విమర్శలకు, ఆరోపణలకు వేదిక ….

అయితే ఈ వ్యవహారాలతో ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు. వారు కరోనా కష్టాల్లో నిండా మునిగి ఉన్నారు. విద్యుత్ బిల్లులు వ్యవహారం, ఇసుక లభ్యత ఇలా తమకు లబ్ది చేకూరే అంశాల్లో విపక్షం వ్యవహారం ఎలా సాగించింది దీనికి అధికారపార్టీ ఏ మేరకు స్పందించింది అన్నదే కావాలి. నేతల అరెస్ట్ లు అక్రమాలు అవినీతి అంటూ ఒక పార్టీ మరో పార్టీ పై దుమ్మెత్తిపోసుకుని బూతులు తిట్టుకోవడం వల్ల ఎంటర్ టైన్మెంట్ తప్ప మరేమి ఉండదన్నది జన మనోగతం.

ఎవరి ప్రయోజనాల కోసం….

ఈ సమావేశాలకు నల్లచొక్కాలతో వచ్చి నిరసనలు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటికప్పుడు విలువలకు తిలోదకాలు ఇస్తూ నడుస్తున్నాయి తప్ప ప్రజాహితమే పరమావధిగా సాగడం లేదన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదుల ఆవేదన. అయినా కానీ తమ పంతాలు పట్టుదలలకే అధికార విపక్షాలు ముందుకు సాగడం విచారకరమంటున్నారు. దీనికి తోడు రెండు ప్రధాన పార్టీలు ఈ సమావేశాలకు ముందే రచ్చకు వ్యూహాలు రచించుకోవడం ఎవరి ప్రయోజనాలకు అన్న ప్రశ్న అందరిలో అలాగే ఉంది.

Tags:    

Similar News