దాడికి రెడీ… దేనికైనా సిద్ధమేనట

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16వ తేది నుండి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార విపక్షాలు ఒకరిమీద [more]

Update: 2020-06-15 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16వ తేది నుండి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార విపక్షాలు ఒకరిమీద ఒకరు మాటల దాడి చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. చాలా రోజుల తర్వాత తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అనేక అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గట్టిగానే కసరత్తులు చేసింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం కూడా నిర్వహించింది.

అసెంబ్లీ సమావేశాల్లో…..

ప్రధానంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్ష తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అదే సమయంలో విపక్షానికి నోట మాట రాకుండా చేస్తామని వైసీపీ చెబుతోంది. ఇప్పటికే ఇసుక, ఇంగ్లీష‌ మీడియం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంతో పాటు ఇళ్ల స్థలాల పంపిణి వంటి విషయాల్లో అధికార పక్షం వైఖరిని ఎండగట్టేందుకు టీడీపీ రెడీ అయిపోయింది.

విపక్షానికి ధీటుగా….

న్యాయస్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ఉత్సాహంతో ఉంది. అదే సమయంలో తాము అమలు చేస్తున్న సంక్షేమీ పధకాలు, వివిధ అంశాల్లో తాము చేయించిన సర్వేలతో విపక్షాన్ని ఇరుకునపెట్టాలని వైసీపీ భావిస్తుంది. బడ్జెట్ సమావేశాలు కావడంతో ఖచ్చితంగా విపక్షానికి కూడా తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ ఏడాది పాలనపై కూడా విపక్షం అసెంబ్లీ సమావేశాల్లో విరుచుకుపడే అవకాశముంది.

కరోనా ఉండటంతో….

అయితే శాసనసభ సమావేశాల నిర్వహణలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు రాజ్యసభ ఎన్నికలతో పాటు సమావేశాలు జరుగుతుండటంతో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. శాసనసభలో 60 ఏళ్ల వయసు పైబడిన సభ్యులు కూడా ఉండటంతో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశాలకు భద్రతగా వచ్చే పోలీసు సిబ్బంది కూడా పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.

Tags:    

Similar News