ఆ ముగ్గురికి బ్యాడ్ పీరియడ్ స్టార్టయిందా?

గులాబీ పార్టీలో ఆ ముగ్గురు మూడు మూలస్తంభాల్లో ఒకరు. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కారు పార్టీ అధినేత ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత [more]

Update: 2020-12-05 08:00 GMT

గులాబీ పార్టీలో ఆ ముగ్గురు మూడు మూలస్తంభాల్లో ఒకరు. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కారు పార్టీ అధినేత ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత ఓటమి నుంచి అధికారపార్టీకి బ్యాడ్ పిరియడ్ మొదలైపోయింది. ఆ తరువాత దుబ్బాక ఎన్నికలకు గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించి ఎన్నికలు నడిపించారు. కానీ ప్రత్యర్థి బిజెపి చేతిలో సొంతపార్టీ అభ్యర్థి ఓటమి చెందడంతో పరోక్షంగా ఆయన ఓడినట్లే అయ్యింది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకం అయిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేరషన్ ఎన్నికల్లో రాజకీయ ఆల్ రౌండర్ కెసిఆర్ తనయుడు కెటిఆర్ ఎప్పటిలాగే రంగంలోకి దిగారు. సెంచరీ కొట్టి మ్యాచ్ ను విజయం వైపు నడిపిస్తారనుకున్న కెటిఆర్ వ్యూహాలు ఈసారి ఫలించలేదు సరికదా బిజెపి తెలంగాణ గడ్డపై అధికారపార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించేసింది.

శ్రేణుల్లో నైరాశ్యం …

దుబ్బాక ఓటమి తరువాత నుంచి గులాబీ శ్రేణుల్లో గందరగోళం మొదలైంది. ఎప్పుడు గెలుపును మాత్రమే ఆస్వాదించే కారు పార్టీ ఓటమి ని కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటుందని లెక్కేసుకోలేదు. ముఖ్యంగా గులాబీ పార్టీకి కాబోయే దళపతి నడిపించే ఎన్నికల్లో ఇలా చతికిల పడతామని అస్సలే అనుకోలేదు. ఈ పరాజయానికి అనేక కారణాలు ఉన్నా ఓటమి ఓటమే కనుక ఇప్పుడు అధికారపార్టీ తన తప్పులను సమీక్షించుకునే పని షురూ చేయక తప్పదు.

ప్యాచ్ వర్క్ చేయాల్సిందేనా?

కుటుంబ పార్టీ గా అంతా పిలిచే గులాబీ కోటకు వరుస బీటలు పార్టీ శ్రేణుల్లో నీరసాన్ని నింపనున్నాయి. తిరిగి సైన్యాన్ని ఉత్సాహపరిచేందుకు ఇక స్వయంగా కెసిఆర్ సీన్ లోకి దిగడంతో పాటు ఎక్కువ సమయం ప్యాచ్ వర్క్ చేసేందుకు కేటాయించాలిసి ఉంది. అదేవిధంగా తనవాళ్లు అనుకున్న రక్తసంబంధీకులు కూడా పార్టీని ఒడ్డున పాడేయలేకపోవడంపై కేసీఆర్ సమీక్షించుకోవాలి. తమ పార్టీ కుటుంబ పార్టీ కాదని తెలంగాణ వాదుల పార్టీ అన్న నమ్మకం గట్టిగా కలిగిస్తేనే వచ్చే ఎన్నికల నాటికి రణక్షేత్రంలో పోరాడగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News