మంత్రి పదవి కోసం ముగ్గురు బ్రదర్స్ …?
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, వైసీపీ నుంచి వియ్యంకులు, అన్నదమ్ములు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా రెండు పార్టీల నుంచి రక్తసంబంధీకులు అసెంబ్లీలో [more]
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, వైసీపీ నుంచి వియ్యంకులు, అన్నదమ్ములు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా రెండు పార్టీల నుంచి రక్తసంబంధీకులు అసెంబ్లీలో [more]
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, వైసీపీ నుంచి వియ్యంకులు, అన్నదమ్ములు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా రెండు పార్టీల నుంచి రక్తసంబంధీకులు అసెంబ్లీలో సభ్యులే. టీడీపీ నుంచి బాబాయ్, అమ్మాయ్ అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేలు. జగన్, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు. ఇక ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వై. వెంకట్రామా రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఈ ముగ్గురూ కూడా సొంత అన్నదమ్ములే కావడం విశేషం. వీరిలో సాయిప్రసాద్ రెడ్డి పెద్దవాడు. సాయి ప్రసాద్, బాల నాగిరెడ్డిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యేలు కాగా… వెంకట్రామరెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సాయిప్రసాద్ మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. ఆయన వైసీపీ నుంచే రెండు సార్లు గెలిచారు.
కుటుంబంలో అందరూ….
విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు అన్నదమ్ముల మరో సోదరుడు శివరామిరెడ్డి ఉరవకొండ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మరోసారి ఎమ్మెల్సీ అయ్యి.. విప్‌గా పనిచేశారు. వీరి తండ్రి భీమ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, నలుగురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అయిన చరిత్ర దేశ చరిత్రలోనే ఏ కుటుంబానికి లేదు. ఇలా అరుదైన ఘనత బాల నాగిరెడ్డి ఫ్యామిలీకే దక్కింది. ఇక బాలనాగిరెడ్డి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. వాస్తవంగా చూస్తే సీనియార్టీ పరంగా ఆయనే కేబినెట్ రేసులో ముందు ఉంటారు. అయితే ఈ సారి మాత్రం మనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఉండాల్సిందే అని ఈ అన్నదమ్ములు డిసైడ్ అవ్వడంతో పాటు అందరూ కలిసే లాబీయింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
జగన్ కు నమ్మకంగా…..
ఈ రేసులో బాల నాగిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి ఇద్దరూ ఉన్నా… సాయిప్రసాద్ పెద్దవాడు కావడంతో ముందు ఆప్షన్‌గా ఆయన్నే పెట్టాలని వీరు డిసైడ్ అయ్యారట. జగన్‌కు ఈ ముగ్గురు అన్నదమ్ములుంటే అభిమానమే. వీరు వివాదాలకు దూరంగా తమ పని తాము చేసుకుంటూ పోతారు. వెంకట్రామా రెడ్డి జూనియర్ కావడంతో ఆయన రేసులో లేకపోయినా… మిగిలిన ఇద్దరూ కర్నూలు జిల్లా నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వాలంటే జగన్ ఖచ్చితంగా రెండు కేబినెట్ బెర్త్‌లు రెడ్లకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.
బుగ్గనను తప్పించినా…?
బుగ్గనను తప్పించి బాలనాగిరెడ్డి సోదరుల్లో ఎవరికి అయినా పదవి ఇస్తారా ? అన్నది సందేహమే. ఒక వేళ జయరాంను తప్పించి.. బుగ్గనను కంటిన్యూ చేస్తే రెండు మంత్రి పదవులు రెడ్లకే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనా మంత్రి పదవి విషయంలో ఈ సోదరులు అండర్ స్టాండింగ్‌కు వచ్చినా జగన్ లెక్కల్లో వీరు ఉన్నారా ? లేదా ? ఉంటే ఎవరికి ఆ లక్కీ ఛాన్స్ దక్కుతుందో ? చూడాలి.