బ్రదర్స్ భయపడిపోతున్నారా….?
నెల్లూరులో టీడీపీ రాజకీయాలను శాసించిన నాయకుల్లో బీద సోదరులు ప్రముఖంగా తెరమీదికివస్తారు. బీద రవిచంద్రయాదవ్.. బీద మస్తాన్ రావులు.. సుదీర్థంగా టీడీపీలో ఉన్నారు. బీద కావలి ఎమ్మెల్యేగా [more]
నెల్లూరులో టీడీపీ రాజకీయాలను శాసించిన నాయకుల్లో బీద సోదరులు ప్రముఖంగా తెరమీదికివస్తారు. బీద రవిచంద్రయాదవ్.. బీద మస్తాన్ రావులు.. సుదీర్థంగా టీడీపీలో ఉన్నారు. బీద కావలి ఎమ్మెల్యేగా [more]
నెల్లూరులో టీడీపీ రాజకీయాలను శాసించిన నాయకుల్లో బీద సోదరులు ప్రముఖంగా తెరమీదికివస్తారు. బీద రవిచంద్రయాదవ్.. బీద మస్తాన్ రావులు.. సుదీర్థంగా టీడీపీలో ఉన్నారు. బీద కావలి ఎమ్మెల్యేగా కూడా విజయం కూడా సాధించారు. ప్రస్తుతం బీద రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయనే జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. అయితే, తాజా ఎన్నికల సందర్భంగా మారిన ఈక్వేషన్ల కారణంగా వీరికి రాజకీయంగా పెను కుదుపు ఎదురైంది. నిజానికి నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ, కురుగొండ్ల రామకృష్ణ వంటి దిగ్గజాలు ఉన్నారు.
వారిదే ఆధిపత్యం…
అయినా కూడా బీద సోదరులు టీడీపీలో తమ సత్తా చాటారు. వివాద రహితులుగా ముద్ర వేసుకున్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబుకు అనుంగు నేతలుగా గుర్తింపు సాధించారు. ఒకపక్క రాజకీయాల్లో ఉంటూనే బీఎంఆర్ సంస్థ ద్వారా వ్యాపారాలు నిర్వహించారు. అలాంటి నాయకులు తాజాగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఓటమిపాలయ్యారు. కావలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన బీద మస్తాన్ రావును ఎంపీగా నిలబెట్టారు చంద్రబాబు. అయితే, అదే సమయంలో వైసీపీ తరఫున ఆదాలప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు.
ఎంపీగా పోటీచేయడంతో…..
టీడీపీ రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు 2009లో కావలి ఎమ్మెల్యేగా గెలిచిన బీద మస్తాన్‌రావు పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో అనూహ్యంగా ఓడిపోయారు. అయినా పార్టీ అధికారంలో ఉండడంతో ఐదేళ్ల పాటు ఇన్‌చార్జ్‌గా చక్రం తిప్పారు. అటు సోదరుడు రవిచంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను, ఎమ్మెల్సీగాను దూసుకుపోయారు. ఇక ఈ ఎన్నికల్లో బాబు పట్టుబట్టి మరీ నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు. ఆయన అప్పటి వరకు టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్లిన ఆదాల చేతిలో చిత్తుగా ఓడిపోయారు.
దాడులతోనూ….
వాస్తవానికి టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయిన వెంటనే వైసీపీలోకి జంప్ చేశారు ఆదాల. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. బీద మస్తాన్ రావు ఓడిపోగా.. ఆదాల విజయం సాధించారు. అదే సమయంలో పార్టీ ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవలేక పోయింది. వైసీపీ మొత్తంగా క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో ఈ ఇద్దరు సోదరులు మౌనం వహించారు. మరోపక్క, బీఎం ఆర్ సంస్థపై ఐటీ, సీబీఐ దాడులు వీరిని మరింతగా బెంబేలెత్తించాయి. దీంతో ఈ ఇద్దరూ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే, పార్టీ మారే ఉద్దేశం లేక పోయినా.. పార్టీలో ఏ కార్యక్రమానికీ కూడా హాజరుకావడం లేదు. దీంతో వీరి భవితవ్యం ఏంటనే విషయం ప్రముఖంగా చర్చకు వస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.