బీద బ్రదర్స్ … వావ్…క్యా ఖేల్ హై

ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి దార‌ణంగా ఉంది. ఎక్కడిక‌క్కడ పార్టీ ఎదురీత ధోర‌ణిలోనే ఉండ‌డం గమ‌నార్హం. దీంతో పార్టీని బ‌తికించుకోవ‌డం కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏదో ఒక [more]

Update: 2020-03-04 12:30 GMT

ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి దార‌ణంగా ఉంది. ఎక్కడిక‌క్కడ పార్టీ ఎదురీత ధోర‌ణిలోనే ఉండ‌డం గమ‌నార్హం. దీంతో పార్టీని బ‌తికించుకోవ‌డం కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏదో ఒక కార్యక్రమాన్ని ముందుండి న‌డిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న చేస్తున్న కార్యక్రమాలు ఒక‌వైపు పార్టీలో జ‌వ‌స‌త్వాలు పెంచుతుండ‌గా.. మ‌రోప‌క్క పార్టీలోని నాయ‌కులు వేస్తున్న స్కెచ్‌లు పార్టీని మ‌రింత బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు జిల్లా కావ‌లిలోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బీద సోదరుల్లో….

నిజానికి నెల్లూరులో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒక్కచోట కూడా టీడీపీ విజ‌యం సాధించ‌లేక పోయింది . దీంతో ఇక్కడ పార్టీని కింద నుంచి పై వ‌ర‌కు పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఈ కోణంలోనే ఇక్కడి నాయ‌కుల‌కు ఆయ‌న ఎప్పటిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే, కావ‌లి నియో జ‌కవ‌ర్గంలో మాత్రం అనూహ్యమైన ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ పార్టీకి అండ‌గా నిల‌వాల్సి న బీద సోద‌రులు ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్నవిదంగా వ్యవ‌హ‌రిస్తుండ‌డంతో పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని అంటున్నారు.

వైసీపీలో చేరడంతో…..

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిత‌ర్వాత కావ‌లి మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్ రావు ఇటీవ‌ల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. త‌మ వ్యాపారాలు వ్యవ‌హారాలు కాంట్రాక్టుల‌ను కాపాడుకునేందుకు ఆయ‌న పార్టీ మారిపోయారు. అది కూడా కావ‌లి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో ఆయ‌న చేతులు క‌లిపి ముందుకు సాగుతున్నారు. దీంతో బీద అనుచ‌రుల్లో చాలా మంది వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. దీంతో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని అంటున్నారు. కానీ, ఈ ప‌రిస్థితిని స‌ర్దుబాటు చేసి లైన్‌లో పెట్టి పార్టీని పుంజుకునేలా చేయాల్సిన ర‌విచంద్ర .. నాయ‌కుల‌పై వీరంగం వేస్తున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

చేరడానికి నాలుగురోజులు ముందు……

కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి పట్టణ అధ్యక్షులు అమరా వేదగిరి సుబ్బారాయుడు గుప్తాతో పాటూ, మరో నలుగురు ముఖ్య నేతలు ఎమ్మెల్యే రామిరెడ్డి, బీదా మస్తాన్ రావు సమక్షంలో వైసిపి కండువాను కప్పుకున్నారు. దీనిని ముందుగానే గ్రహించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు ర‌విచంద్ర.. వీరు పార్టీలో చేరే నాలుగు రోజుల ముందుగానే కమిటిలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, త్వరలోనే అడహాక్ కమిటి వేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది.

మరో సోదరుడు మాత్రం….

అటు ముసునూరులోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన తేనేటి విందులో, కొందరు టిడిపి నేతలు పాల్గొనడంతో ఆగ్రహించిన బీద‌ రవిచంద్ర, మొత్తం 11 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నేతల్లేని పార్టీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ కావలి వైసిపి నేతలు చాకచక్యంగా తమకు అనుకూలంగా మలుచుకుంటుండంతో, టిడిపి పరిస్థితి దారుణంగా మారిపోయింది. కొండ నాలుక‌కు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిన‌ట్టు గా వ్యవ‌హ‌రిస్తున్న బీద సోద‌రుల‌తో టీడీపీ నిండా మునిగిపోవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రి చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Tags:    

Similar News