ఇక‌, బీజేపీ భ‌జ‌న‌.. నాలుగు సొంత ఛానెళ్ల ఏర్పాటు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ అధికారం కైవ‌సం చేసుకునే దిశ‌గా నాయ‌కులు దృష్టి పెట్టారు. అయితే.. దీనిలో [more]

Update: 2021-02-03 09:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ అధికారం కైవ‌సం చేసుకునే దిశ‌గా నాయ‌కులు దృష్టి పెట్టారు. అయితే.. దీనిలో ప్రధానంగా నాయ‌కుల పాత్ర ఉన్నప్పటికీ దీనికి మించి మ‌రింత దూకుడు ప్రద‌ర్శించేలా ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా మీడియా మేనేజ్ మెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికీ టీవీ 9 మాజీ సీఈవో ర‌వి ప్రకాశ్‌తో బీజేపీ పెద్దలు సంప్రదింపులు జ‌రిపిన‌ట్టు తాజాగా వెలుగు చూసింది. దీని ప్రకారం.. ఒకే సారి నాలుగు వార్తా ఛానెళ్లను రంగంలోకి దింపేందుకు బీజేపీ వ్యూహం ర‌చిస్తోంది.

అన్ని పార్టీలకూ….

ఈ నాలుగు ఛానెళ్లు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండడంతోపాటు.. బీజేపీని అధికారంలోకి తెవ‌డం లేదా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బ‌లోపేతానికి కృషి చేసేలా ప‌ని చేస్తాయ‌ట‌. ఇప్పటికే వీటికి సంబంధించిన సిబ్బందిని కూడా రిక్రూట్‌మెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. వీరికి ప్రత్యేకంగా బెంగ‌ళూరులోని బీజేపీకి అనుకూల క‌న్నడ ఛానెల్‌లో శిక్షణ కూడా ఇస్తున్నార‌ని స‌మాచారం. ఈ ఏడాది చివ‌రి నాటికి ఈ నాలుగు ఛానెళ్లు ప్రసారాలు ప్రారంభిస్తాయ‌ని బీజేపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస మొద‌లైంది. తెలంగాణ‌లో కేసీఆర్‌కు, ఏపీలో సీఎం జ‌గ‌న్‌కు ప్రత్యేకంగా సొంత ఛానెళ్లుఉన్నాయి. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూలంగా మెజార్టీ న్యూస్ ఛానెళ్లు, రెండు పేప‌ర్లు ప‌నిచేస్తున్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

ప్రత్యేక దృష్టి పెట్టి…..

ఈ క్రమంలో తాము కూడా ఛానెళ్లు పెట్టుకోవాల‌ని బీజేపీ ఎప్పటి నుంచో ప్ర‌య‌త్నిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని స‌మ‌ర్థించే మీడియా ఇప్పటి వ‌ర‌కు లేదు. ఒక్క తెలంగాణ‌లో మాత్రం వీ6 ఛానెల్‌, వెలుగు పేప‌ర్ ఉన్నాయి. వీటికి ఇప్పుడు రాజ్‌న్యూస్ కూడా తోడ‌వుతోంది. అయితే.. ఇప్పటి వ‌ర‌కు కేంద్రంలోని బీజేపీ పెద్దలు పెద్దగా రెండు తెలుగు రాష్ట్రాల‌పై దృష్టి పెట్టలేదు. అయితే.. ఇప్పుడు కేంద్రంలో స‌మీక‌ర‌ణ‌లు మారిన నేప‌థ్యంలో అమిత్ షా నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు న‌డ్డా వ‌రకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉన్న అవ‌కాశాల‌పై విస్తృతంగా దృస్టిపెట్టారు. ప‌లువురికి కేంద్రంలో ప‌ద‌వులు ఇచ్చారు.

సోషల్ మీడియాలో దూకుడుగా….

ఇక తెలుగు రాష్ట్రాల్లో సోష‌ల్ మీడియాను బీజేపీ విస్తృతంగా వాడుకుంటోంది. గ‌త దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపులో సోష‌ల్ మీడియా కూడా కీల‌క పాత్ర పోషించింది. ఇక ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా బాగా వాడుకునేందుకే ఈ స‌రికొత్త ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా ద్వారా కూడా బీజేపీని ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్లడంపై నేత‌లు దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే ఏకంగా ఒకే సారి నాలుగు ఛానెళ్లను ప్రవేశ పెట్టాల‌ని నిర్ణయించారు. మ‌రికొద్ది నెలల్లోనే ఈ ఛానెళ్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని క‌మ‌లం పార్టీ నాయ‌కులు ఆఫ్ ది రికార్డుగా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News