గుంటూరులో బీజేపీ టార్గెట్ ఆ రెండు బిగ్ వికెట్లేనా?
ఏపీలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందా ? ఆ పార్టీ సంస్థాగతంగా దూసుకుపోతోందా ? అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి.. రాసుకోవడానికి మాత్రమే. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే [more]
ఏపీలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందా ? ఆ పార్టీ సంస్థాగతంగా దూసుకుపోతోందా ? అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి.. రాసుకోవడానికి మాత్రమే. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే [more]
ఏపీలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందా ? ఆ పార్టీ సంస్థాగతంగా దూసుకుపోతోందా ? అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి.. రాసుకోవడానికి మాత్రమే. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఆ పార్టీకి బలం లేదు. గత ఎన్నికల్లో 175 చోట్ల, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క చోట కూడా డిపాజిట్ రాని పార్టీ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా.. అంతకుమించిన అతిశయోక్తి ఏం ? ఉంటుంది. కాకపోతే పైన మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పలువురు నేతలు, ఆర్థిక నేరగాళ్లు, రాజకీయ నిరుద్యోగులు పోలోమంటూ కాషాయ కండువా కప్పుకుంటున్నారు. వీరిలో ఎంతమంది వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుస్తారా ? అంత దమ్ము ఈ జంపింగ్ నేతలకు ఉందా ? అన్న ప్రశ్నలకు వాళ్ల దగ్గరే ఆన్సర్లు ఉండవు.
ఎవరు వచ్చినా….?
ఈ మూడేళ్ల పాటు వారి వ్యాపార వ్యవహారాలను చక్కపెట్టుకోవడానికి, తాము రాజకీయంగా అధికారంలో ఉన్నామని చెప్పుకునేందుకు పోయిన వాళ్లే ఎక్కువ. పైగా వీళ్లకు ఎలాంటి పదవులు కూడా రావన్నది నిజం. అయితే బీజేపీ సంస్థాగతంగా పట్టు సాధించిందా ? లేదా ? అన్నది పక్కన పెట్టేస్తే సుజనా చౌదరి, సీఎం.రమేష్, టీజీ. వెంకటేష్ నుంచి అప్పుడెప్పుడో పదిహేడు రోజులు సీఎం చేసి జనాలు మర్చిన నాదెండ్ల భాస్కరరావు వరకు ఎవరు వచ్చినా పార్టీ కండువాలు కప్పేస్తూ వస్తోంది. ఏపీలో బీజేపీలో చేరే పార్టీ నేతల కౌంట్ పెరుగుతుందన్న ఆనందమే తప్ప.. రోజు రోజుకు ఆ పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో పెరుగుతోన్న వ్యతిరేకత మాత్రం వాళ్లకు కనపడదు.. వినపడదు.
ప్రయార్టీ లేని నేతలను…..
ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీల్లో ప్రయార్టీ లేకుండా పడి ఉన్న నేతలకు వల విసిరే ప్రక్రియ బీజేపీ ముమ్మరం చేస్తోంది. పార్టీలో చేరుతోన్న నేతలు ఏదైనా పదవి ఇస్తారా ? అని అడిగితే… మనం అధికారంలోకి వస్తే మీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి అని చెపుతోంది బీజేపీ అధిష్టానం.. వైసీపీలో చాలా మంది నేతలకు జగన్ కండువాలు కప్పిన రోజున మినహా ఆ తర్వాత ఎవ్వరికి అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ నాయకత్వం మాటలు నమ్మి పార్టీ మారే వాళ్ల పరిస్థితి కూడా అంతే. తాజాగా కీలక జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై బీజేపీ వల విసిరినట్టు తెలుస్తోంది.
ఆ ఇద్దరి నేతలను…..
అప్పుడెప్పుడో వినుకొండలో 2004లో గెలిచి ఆ తర్వాత సీటు రాక ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, సత్తెనపల్లిలో వరుసగా రెండుసార్లు గెలిచి గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డికి మా పార్టీలోకి వస్తే పెత్తనం మీదే.. పదవులు మీకే అని బీజేపీ నేతలు వలలు వేస్తున్నారని గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వినుకొండలో మక్కెన వల్ల వైసీపీకి ప్లస్ అయ్యింది.. ఆయన్ను పార్టీలో చేర్చుకునేటప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు, ఎమ్మెల్యే జీవీ. ఆంజనేయులు ఇద్దరూ ఎమ్మెల్సీ లేదా డీసీసీబీ చైర్మన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
అంబటిపై అసంతృప్తితో…..
తీరా చూస్తే జగన్ స్వయంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవి హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్‌నే పట్టించుకోవడం లేదు. ఇక వీళ్లు హామీ ఇచ్చిన మక్కెన పదవి ఏ తీరానికి కొట్టుకుపోయిందో ? ఇక ఆయనకు పదవి రాదన్న విషయం అర్థమయ్యే బీజేపీ వైపు చూస్తున్నారట. ఇక యర్రం వెంకటేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గంలో అంబటిపై ఉన్న అసంతృప్తికి తోడు… టీడీపీలో ఉన్న నాయకత్వ శూన్యత నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు నేతలు తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నిక ముందు కాషాయ కండువా కప్పుకుంటారా ? తర్వాత కప్పుకుంటారా ? అన్నది చూడాలి.