జగన్ ను కార్నర్ చేసే యోచనలో ఉన్నారా?

ఏపీ ప‌రిణామాల‌పై బీజేపీ దృష్టి పెట్టిందా ? ముఖ్యంగా ప్రధాన‌మంత్రి కార్యాల‌యం ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు పీఎంవోలోని కీల‌క [more]

Update: 2021-03-09 13:30 GMT

ఏపీ ప‌రిణామాల‌పై బీజేపీ దృష్టి పెట్టిందా ? ముఖ్యంగా ప్రధాన‌మంత్రి కార్యాల‌యం ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు పీఎంవోలోని కీల‌క అధికారులు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి కేంద్రం కీల‌క నిర్ణయాలు తీసుకుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించాల‌ని నిర్ణయించుకుంది. ఈ విష‌యంలో ఎవ‌రూ ఎదురు చెప్పకుండా ఇప్పటికే ప‌లు పార్టీల‌కు ఆదేశాలు కూడా జారీ చేసింది. బ‌హుశా ఈ క్రమంలోనే అటు ప్రతిప‌క్షం టీడీపీ, ఇటు అధికార ప‌క్షం వైసీపీ నామ‌మాత్రంగానే విశాఖ ఉక్కుపై ఉద్యమాలు చేస్తున్నాయి.

హోదా విషయంలో….

అదే స‌మ‌యంలో ప్రత్యేక హోదా ఇవ్వబోమ‌ని చెప్పిన త‌ర్వాత కూడా ప‌దేప‌దే సీఎం జ‌గ‌న్ ప్రస్తావించ‌డాన్ని కూడా మోడీ సీరియ‌స్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని ఇప్పటికే తేల్చేశామ‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ అడిగి.. త‌మను బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్నార‌నే భావ‌న‌లో ఆయ‌న ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక‌పైప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న‌ను తీసుకురాకూడ‌ద‌ని .. తాజాగా కేంద్రం నుంచి ఏపీకి లేఖ అందిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, పోల‌వ‌రం నిధుల విష‌యంలోనూ ఒత్తిడి చేయ‌రాద‌ని.. ఈ విష‌యంలో 2014 లెక్కల ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తామ‌ని.. కూడా తెగేసి చెప్పిన‌ట్టు తెలిసింది.

బద్నాం చేసేలా…?

ఈ విష‌యంలో కేంద్రాన్ని.. ప్రధాని మోడీని బ‌ద్నాం చేసేలా ఎవ‌రు వ్యవ‌హ‌రించినా.. సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణించాల‌ని నిర్ణయించుకున్నట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి స‌మాచారం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు అటు సీఎం జ‌గ‌న్ కానీ.. ఇటు ప్రధాన ప్రతిప‌క్షాలు.. టీడీపీ, జ‌న‌సేన‌లు మౌనం పాటిస్తున్నాయి. ఈ విష‌యంలో ఇంత‌కు మించి చెప్పేది ఏమీలేద‌ని.. అన్నీ చేత‌లే ఉంటాయ‌ని కూడా కేంద్రం హెచ్చరించింద‌ని కూడా తెలుస్తోంది. తేడా వ‌స్తే.. తేడాగానే తాము వ్యవ‌హ‌రిస్తామ‌ని హెచ్చరించిన‌ట్టు స‌మాచారం.

నిలదీస్తే అంతే సంగతులు….

దీంతో ఇప్పుడు సీఎంవో నుంచి చంద్రబాబు వ‌ర‌కు ఎలా వ్యవ‌హ‌రించాల‌నే విష‌యంపై త‌ర్జన భ‌ర్జన చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగానే మోడీని విమ‌ర్శించే ప్రతిప‌క్ష పార్టీల సీఎంల‌కు ముందు ప‌ద్దతిగా చెప్పడం లేక‌పోతే అటు గ‌ట్టిగా టార్గెట్ చేయ‌డంతో పాటు కేంద్రం నుంచి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు లేకుండా చేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్న ప‌రిస్థితే ఉంది. ఇప్పుడు అదే పంథా ఏపీలోనూ ఫాలో అవుతూ ఇక్కడ మోడీని అధికార‌, ప్ర‌తిప‌క్షాలు కూడా విమ‌ర్శించే ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవ‌రి బాధ‌లు వాళ్ల‌కు ఉన్నాయి.. ఎవ‌రి కేసులు వాళ్లకు ఉండ‌డంతో మోడీని ఏపీ నుంచి నిల‌దీసే నేతే ఉంటారా ? అన్నది డౌటే ?

Tags:    

Similar News