బీజేపీ నేత‌ల‌పై ఈ ప్రచారం ఏంటి… వాస్తవం ఎంత‌…?

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు అయినా చోటు చేసుకోవ‌చ్చు. అయితే.. దీనికి కూడా ఒక ప‌ద్ధతి ఉంటుంది క‌దా! కానీ, ఒక్కొక్కసారి ప‌ద్ధతి లేని [more]

Update: 2021-07-13 00:30 GMT

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు అయినా చోటు చేసుకోవ‌చ్చు. అయితే.. దీనికి కూడా ఒక ప‌ద్ధతి ఉంటుంది క‌దా! కానీ, ఒక్కొక్కసారి ప‌ద్ధతి లేని రాజ‌కీయాలు కూడా చోటు చేసుకుంటాయ‌న్నది తెలిసిందే. ఎవ‌రు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. రేపు ఏ పార్టీలో ఉంటారో ప్రజ‌ల‌కే కాదు.. ఆ నేత‌ల‌కే తెలియ‌దు. సిచ్యుయేష‌న్ అలా డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కొంద‌రు నేత‌లు.. త్వర‌లోనే టీడీపీ బాట ప‌డ‌తార‌ని పెద్ద ఎత్తున రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి కార‌ణాలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. కేంద్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుంద‌నే ఆశ‌లు దాదాపు క‌నిపించ‌డం లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో పార్టీ క‌నుక ఆశించిన విధంగా పుంజుకుని ఉంటే ఆ ప‌రిస్థితి వేరేగా ఉండేది.

ఈ నేతలు పార్టీ మారతారని…?

కానీ, తిరుప‌తి ఉప‌పోరు.. తీవ్రస్థాయిలో బీజేపీని నిరాశ‌లోకి నెట్టేసింది. దీంతో ఇప్పుడు పార్టీలో ఉన్న నేత‌ల‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌, ప్రస్తుతం రాజ్య‌స‌భ సభ్యుడిగా ఉన్న సీఎం ర‌మేష్‌, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడుగా ఉన్న క‌డ‌ప‌కు చెందిన మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, విశాఖ ఉత్తర మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు త్వర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కానీ, వాస్తవానికి విష్ణుకుమార్ రాజు.. ఆది నుంచి బీజేపీనే న‌మ్ముకున్నారు. ఆపార్టీలోనే ఉన్నారు. సో.. ఆయ‌న పార్టీ మారే అవ‌కాశం ఎక్కడా క‌నిపించ‌డం లేదు.

బాబుతో టచ్ లో…..

ఇక‌, క‌న్నా.. కాంగ్రెస్ నుంచి ఆచి తూచి ఆలోచించి.. జంప్ చేశారు. ఈ క్రమంలోనే ఆయ‌న బీజేపీలో చేరారు. చేర‌గానే. రాష్ట్ర చీఫ్ గా ప‌గ్గాలు చేప‌ట్టారు. సో.. ఇంత కీల‌క ప‌ద‌విని అప్పగించిన పార్టీలో లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ, ఆయ‌న మాత్రం పార్టీని వ‌దిలి పెట్టే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. అయితే వీరిద్దరు కూడా చంద్రబాబుతో ట‌చ్‌లో ఉన్నారంటున్నారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రిని ఎప్పుడూ న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని ఆ పార్టీ నేత‌లే అంటున్నారు. ఆయ‌న చంద్రబాబు భ‌క్తుడు అన్నది తెలిసిందే.

పీఛేముడ్ అనొచ్చు…..

ఇక రాజ్యస‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. సో.. ఆయ‌న తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంటే ఉండొచ్చు. అదేవిధంగా ఆదినారాయ‌ణ రెడ్డి కూడా కాంగ్రెస్ టు వైసీపీ ఇటు నుంచి టీడీపీ నుంచి బీజేపీలోకి వ‌చ్చారు. ఈయ‌న కూడా మ‌రోసారి పీఛే ముడ్ అనొచ్చు. అయితే.. ఇక్కడ కూడా మ‌రో రీజ‌న్ ఉంది.. బీజేపీ పుంజుకున్నా పుంజుకోక‌పోయినా.. బీజేపీ-టీడీపీల‌ను ఐక్యం చేసేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుకు వాటిని సిద్ధం చేసేందుకు ఈ నాయ‌కులు ప్రయ‌త్నించే అవ‌కాశం ఉంది. అంతే త‌ప్ప.. పార్టీలు మార‌తార‌నేది మాత్రం పెద్దగా విశ్వ‌స‌నీయ స‌మాచారం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News