కమలానికి అసలు సవాల్ ఏపీ లోనేనట …?

తెలంగాణ లో పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమాకానికి ముందు కాషాయ దళం పెద్ద కసరత్తే చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాదేతర వ్యక్తికి పట్టం [more]

Update: 2020-03-19 03:30 GMT

తెలంగాణ లో పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమాకానికి ముందు కాషాయ దళం పెద్ద కసరత్తే చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాదేతర వ్యక్తికి పట్టం కట్టడం ద్వారా దూకుడుగా వుండే వారే సైన్యాధ్యక్షుడిగా ఉండాలనే డిసైడ్ అయ్యింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉండి పార్టీ మారినా డీకే అరుణ వంటివారికి సైతం అధ్యక్ష రేసులో నిరాశే ఎదురైంది. కరీంనగర్ ఎంపి గా ఉన్న సంజయ్ కి వున్న ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ తెలంగాణ అధ్యక్ష పగ్గాలు అందుకోవడంలో కీలకంగా మారింది. బలమైన కేసీఆర్ టీం ను ఢీకొనడానికి దూకుడు గా ఉండటం, అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ మారని వ్యక్తిత్వం ఉన్నవారు కావాలనే ఫార్ములా రీత్యా సంజయ్ వైపు అధిష్టానం మొగ్గు చూపడానికి రీజన్స్ అంటున్నారు.

ఏపీ లో తలపోట్లు …

ఏపిలో కూడా పార్టీ అధ్యక్ష పదవికి సమయం పూర్తి అయింది. ఇక్కడ కూడా మార్చాలిసివుంది. అయితే ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మరో ఏడాది కంటిన్యూ చేయమని అభ్యర్ధించారు. వైసిపి లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న కన్నా ను ఆ పార్టీలో చేరకుండా అధ్యక్ష పదవి ఎరవేసి ఆపింది కమలం అధిష్టానం. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్ధన ను అధిష్టానం మన్నిస్తుందా లేక కొత్తవారిని నియమిస్తుందా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీ బిజెపి పగ్గాలు అందుకునేందుకు పోటీ పడుతున్న వారిలో ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు, కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ నడుమ పోటీ తీవ్రంగా సాగుతుంది. ఛాన్స్ ఇస్తే మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు కూడా రెడీ గానే ఉన్నారు.

ఏ ఫార్ములా అనుసరిస్తారు …?

అయితే వీరిలో తెలంగాణ ఫార్ములా ప్రకారం కమలం అధిష్టానం నడుచుకుంటే సోము, విష్ణుకుమార్ రాజు, మాధవ్ లకు అవకాశాలు ఉన్నాయి. ఏపీలో వైసిపి సర్కార్ చాలా బలంగా ఉంది. పార్టీని కిందిస్ధాయి నుంచి బలపర్చాలిసిన పరిస్థితి ఉంది. ఎవరు అధ్యక్షులుగా ఉన్నా ఇది అంత ఈజీ కాదు. అలాగే జనసేన పార్టీ తో పొత్తు సాగుతుంది. ఇంకోవైపు పార్టీ స్టాండ్ రీత్యా వైసిపి – టిడిపి లతో సమాన దూరం పాటిస్తూ పార్టీ ఎదుగుదలకు అడుగులు వేయాలి. ఈ నేపథ్యంలో సమర్ధుడైన నేతకు ముఖ్యంగా పార్టీకి వీరవిధేయులకే అధిష్టానం టిక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి కాషాయపార్టీ ఏమి చేయబోతుందా అన్నది చుడాలిసివుంది.

Tags:    

Similar News