ఆఫర్ ఘోరంగా ఉందటగా

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుంది. ఈ దుస్థితి నుంచి పార్టీ గట్టెక్కేందుకు మరో నాలుగున్నరేళ్ళు ఆగేందుకు తమ్ముళ్ళనుంచి అధినాయకత్వం వరకు ఎవ్వరు సిద్ధంగా లేరు. దాంతో [more]

Update: 2019-12-01 12:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుంది. ఈ దుస్థితి నుంచి పార్టీ గట్టెక్కేందుకు మరో నాలుగున్నరేళ్ళు ఆగేందుకు తమ్ముళ్ళనుంచి అధినాయకత్వం వరకు ఎవ్వరు సిద్ధంగా లేరు. దాంతో కిమ్ కర్తవ్యం అని భావించిన చంద్రబాబు బిజెపి ని ప్రసన్నం చేసుకోవడమే చిక్కుల నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు ఛాన్స్ ఉందని అంచనా వేసేశారు. ఆయన అనుకున్నదే తడవు కొందరు ఎంపీలు సైకిల్ దిగి కమలం పువ్వులతో తిరుగుతున్నారు. సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ వంటివారిని దూరం జరపక తప్పలేదు చంద్రబాబుకి. ఇదే దారిలో మరికొందరికి ఆయనే సిగ్నల్ ఇచ్చారని ప్రచారం నడిచింది. ఇదంతా ఆయన చేయడానికి కేంద్రంలోని మోడీ, షా లను ప్రసన్నం చేసుకునేందుకే అన్నది పొలిటికల్ సర్కిల్స్ టాక్. దాంతో ఎన్డీయే తో మిత్ర బంధం కనీసం అంతర్గతంగా మెయింటైన్ చేయాలన్న ప్లాన్ చంద్రబాబు ది అంటున్నారు.

ఆరెస్సెస్ తో టచ్ లో …

వాజపేయి, అద్వానీ ద్వయం నుంచి చంద్రబాబుకి ఇటు ఆర్ఎస్ఎస్ అటు కమలం అధిష్టానంతో సన్నిహిత సంబంధాలే వున్నాయి. తనపై రాబోయే ముప్పు ముందే వుహిచిన చంద్రబాబు పాత పరిచయాలన్ని తోడి తీసే పనిలో పడిపోయారు. కమలనాధులను ప్రసన్నం చేసుకునేముందు ఆర్ఎస్ఎస్ ఆశీస్సుల కోసం తన మీడియా గురువు, రాజగురువు ల ద్వారా లాబీయింగ్ చేయడం జరిగిందని తెలుస్తుంది. అయితే చంద్రబాబు ను కలుపు కు వెళ్ళడానికి ఒకే ఒక్క షరతు ఆయనకు షాక్ ఇచ్చింది అంటున్నారు.

విలీనం చేయాలంటూ…..

టిడిపి ని బిజెపి లో విలీనం చేసేందుకు సిద్ధం అయితే అంతా ఒకే అనే ఆఫర్ ఆ పార్టీ అధిష్టానం ఆర్ఎస్ఎస్ ద్వారా పంపింది. అది తన కంఠంలో ప్రాణం ఉండగా జరిగే పనే కాదని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే తన చరిత్రలో మామను వెన్నుపోటు పొడిచాడనే మచ్చ ఉండగా పార్టీని విలీనం చేసాడనే అపప్రధ తో జీవితం ముగియడం ఇష్టం లేదని తేల్చేశారని చెబుతున్నారు. దీనికి ప్రతిగా ఎలాంటి షరతులనైనా బిజెపి తో కలిసేందుకు సిద్ధం అని చెప్పినట్లు తెలుస్తుంది.

ఆచితూచి అడుగు వేస్తున్న బిజెపి …

చంద్రబాబు ఎత్తులకు ఇప్పటికే ఎపి లో దశాబ్దాలుగా చిత్తయిపోతూ వస్తున్న బిజెపి ఆయనతో వ్యవహారంపై ఆచితూచి అడుగువేస్తోంది. ఎపి లో పొత్తులు ఉన్నంత కాలం సొంతంగా ఎదగలేం అన్న అంచనాకు కమలం వ్యూహకర్తలు ఇప్పటికే వచ్చేశారు. అందుకే వైసిపి సర్కార్ పై పోరాటం అంశంలో ఎట్టి పరిస్థితుల్లో బలం తక్కువ వున్నా చంద్రబాబు తో సై అనడం లేదు కమలం. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఒక పక్క అధికారపార్టీని మరోపక్క చంద్రబాబు గతంలో చేసిన వ్యవహారాలను లక్ష్యంగా విమర్శలకు దిగిపోతుంది. ఇందులో ఏ మాత్రం మొహమాటం లేకుండా సైకిల్ కి బై బై చెప్పేస్తున్నారు కమలనాధులు.

Tags:    

Similar News