ఇక్కడ గెలవడం గ్యారంటీ అట.. మిషన్ సక్సెస్

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుతో పాటే జరగనున్నాయి. ఈసారి ఇక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పుదుచ్చేరిలో మిషన్ 23 [more]

Update: 2021-02-12 17:30 GMT

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుతో పాటే జరగనున్నాయి. ఈసారి ఇక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పుదుచ్చేరిలో మిషన్ 23 ని ప్రారంభించింది. బీజేపీ అగ్రనేతలందరూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ఐదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

మిషన్ 23గా….

పుదుచ్చేరిలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలున్నాయి. 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో బీజేపీ మిషన్ ను రూపొందించింది. కాంగ్రెస్ నుంచి పార్టీ నేతలను చేర్చుకునే ప్రక్రియను ప్రారంభించిది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడటంతో కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిణామమే. దీంతో పాటు పుదుచ్చేరి చిన్న రాష్ట్రమైన తమ అధీనంలో ఉంటుందని బీజేపీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో…..

పుదుచ్చేరిలో దీర్ఘకాలంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడు ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో డీఎంకే తమిళనాడులో రాకపోయినా పుదుచ్చేరిలో మాత్రం కాంగ్రెస్, డీఎంకే కూటమి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి నారాయణస్వామి అష్టకష్టాలు పడ్డారు. ఆయన పాలన సజావుగా చేసుకునే వీలులేకుండా పోయింది. పుదుచ్చేరిలో బీజేపీని బలోపేతం చేసేందుకు నాలుగేళ్ల క్రితమే బీజేపీ స్కెచ్ వేసింది.

కిరణ‌్ బేడీ ద్వారా….

లెఫ్ట్ నెంగ్ గవర్నర్ గా కిరణ్ బేడీని నియమించింది. కిరణ్ బేడీ తనకు అప్పగించిన పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. కిరణ‌్ బేడీ, నారాయణస్వామిల మధ్య నాలుగేళ్లుగా వార్ కొనసాగుతూనే ఉంది. నారాయణస్వామి న్యాయస్థానాలను, రాష్ట్రపతిని ఆశ్రయించినా ఫలితం లేదు. దీంతో పాటు ఎన్నార్ కాంగ్రెస్ తో కలసి బీజేపీ ఎన్నికలకు వెళ్లడం కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఎన్నార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి. సర్వేలు సయితం పుదుచ్చేరిలో బీజేపీకే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News