ఏవీ సుబ్బారెడ్డికి లైన్ క్లియర్…?

భూమా అఖిలప్రియకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు కుటుంబంలో విభేదాలు, ఆస్తి పంపకాల్లో తేడాలతో తలనొప్పి ఉండగా, అఖిలప్రియను తెలుగుదేశం పార్టీ కూడా దూరం పెట్టే పరిస్థతి [more]

Update: 2021-09-08 03:30 GMT

భూమా అఖిలప్రియకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు కుటుంబంలో విభేదాలు, ఆస్తి పంపకాల్లో తేడాలతో తలనొప్పి ఉండగా, అఖిలప్రియను తెలుగుదేశం పార్టీ కూడా దూరం పెట్టే పరిస్థతి వచ్చింది. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని టీడీపీ అధిష్టానం ఎంకరేజ్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. దీంతో భూమా కుటుంబాన్ని చంద్రబాబు వచ్చే ఎన్నికలకు దూరం పెట్టనున్నారని తెలుస్తోంది.

నాగిరెడ్డి మరణం తర్వాత…?

భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి అఖిలప్రియ పెద్దదిక్కయింది. చంద్రబాబు కూడా ఆమెను మంత్రిని చేశారు. అయితే మంత్రి పదవి ఇచ్చినా పట్టు పెంచుకోవాల్సిన అఖిలప్రియ మరింత బలహీనమయ్యారు. తన వారినందరినీ దూరం చేసుకున్నారు. భూమా వర్గాన్ని పట్టించుకోకపోవడంతో వారంతా మెల్లగా సైడ్ అయిపోయారు. ఇక భూమా కుటుంబంలో కూడా పొరపచ్చాలుతలెత్తాయ. భూమా సోదరుల కుమారులు బీజేపీలో చేరిపోయారు.

అన్నీ సమస్యలే…

ఇక 2019 ఎన్నికలలో ఓటమి పాలయిన తర్వాత భూమా అఖలప్రియ మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఆమె భర్త భార్గవ్ రామ్ జోక్యంతో ఆళ్లగడ్డ, నంద్యాలలో భూమా వర్గం ఆగ్రహంతో ఉంది. ఏవీ సుబ్బారెడ్డిపై హత్య కుట్రకేసు సంచలనమే అయింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా భూమా అఖిలప్రియకు ఇబ్బంది అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించింది. దీనికి తోడు హైదరాబాద్ లో భూముల విషయంలో కిడ్నాప్ కేసు కూడా అఖిలప్రియ కుటుంబానికి చుట్టుకుంది.

ఏదో ఒకటే….

దీంతో చంద్రబాబు రాజకీయంగా భూమా అఖిలప్రియకు పట్టులేదని గుర్తించారు. ఆ కుటుంబంలో ఒక్కరికే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని నిర్ణయించారు. నంద్యాల, ఆళ్లగడ్డలో ఏదో ఒకటి భూమా కుటుంబానికి ఇచ్చి, ఒకటి ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డికి ఈ విధంగా పరోక్ష సంకేతాలు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద భూమా ఫ్యామిలీని చంద్రబాబు సైడ్ చేసేటట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News