రెంటికీ చెడ్డ రేవ‌డిగా.. ఈ యువ మాజీ ఎమ్మెల్యే

ఆయ‌న యువ‌కుడు. రాజ‌కీయాల్లో మంచి ఫ్యూచ‌ర్ ఉన్న నాయ‌కుడు. అయితే.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే కామెంట్లు ఎదుర్కొంటున్నారు. ఆయ‌నే క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన [more]

Update: 2021-05-24 00:30 GMT

ఆయ‌న యువ‌కుడు. రాజ‌కీయాల్లో మంచి ఫ్యూచ‌ర్ ఉన్న నాయ‌కుడు. అయితే.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే కామెంట్లు ఎదుర్కొంటున్నారు. ఆయ‌నే క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద‌రెడ్డి. అనూహ్యంగా రాజ‌కీయ తెర‌మీదికి వ‌చ్చిన‌.. భూమా బ్రహ్మానంద‌రెడ్డి.. గ‌తంలో పాల వ్యాపారంలో ఉన్నారు. అయితే 2017లో రాజ‌కీయ తెర‌మీదికి వ‌చ్చి.. అప్పటి ఉప ఎన్నిక‌లో పోటీ చేసి టీడీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. భూమా బ్రహ్మానంద‌రెడ్డి గెలుపుపై అప్పట్లో జాతీయ స్థాయిలో పెద్ద చ‌ర్చ న‌డిచింది. భూమా కుటుంబం నుంచి రావ‌డంతో ఆయ‌న ఆదిలో బాగానే ఆద‌రాభిమానాలు సంపాయించుకున్నారు.

సోదరితో….?

కానీ, గ‌త ఎన్నిక‌లకు వ‌చ్చేస‌రికి మాత్రం.. అప్పటి మంత్రి, భూమా నాగిరెడ్డి కుమార్తె.. అఖిల ప్రియ‌తో భూమా బ్రహ్మానంద‌రెడ్డికి విభేదాలు వ‌చ్చాయి. దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయ‌ని అంటారు. మంత్రిగా ఉన్న అఖిల త‌న ఆధిప‌త్యం కోసం నంద్యాల‌లో వేలు పెట్టేవారు. భూమా బ్రహ్మానంద‌రెడ్డి అఖిల మ‌హిళ‌… పైగా నంద్యాల‌కు తాను ఎమ్మెల్యే అని ప‌ట్టు ప‌ట్టేవారు. దీంతో ఏకంగా టికెట్ విష‌యంలో పెద్ద పేచీ ఏర్పడింది. ఉప ఎన్నిక‌లో భూమాకు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ టికెట్ ఇచ్చిన అఖిల.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌ట్టించుకోలేదు. పైగా వ‌ద్దని కూడా చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. దీంతో టికెట్ తెచ్చుకోవ‌డంలోనే భూమా బ్రహ్మానంద‌రెడ్డి స‌గం అలిసిపోయారు.

ఎవరి సపోర్ట్ లేకపోవడంతో…?

ఇక‌, ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. వైసీపీ సునామీకి తోడు, కుటుంబ క‌ల‌హాలు, ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్గం నుంచి స‌పోర్ట్ లేక‌పోవ‌డం భూమా బ్రహ్మానంద‌రెడ్డి ఓట‌మికి దారితీసింది. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి ఏంటంటే..ఆ య‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇటు భూమా కుటుంబం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు జ‌గ‌త్ విఖ్యాత‌రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు అఖిల వ్యూహం సిద్ధం చేసుకున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా బ్రహ్మానంద‌రెడ్డికి టీడీపీ ఎట్టి ప‌రిస్థితిలోనూ టికెట్ ఇచ్చే అవ‌కాశం లేద‌న్న పొగ‌లు అయితే నంద్యాల‌లో రాజుకున్నాయి.

ఏవీ కూడా తనకు …?

మ‌రోవైపు ఏవీ సుబ్బారెడ్డి త‌న‌కు సీటు కావాల‌ని కాచుకుని ఉన్నారు. ఇకభూమా బ్రహ్మానంద‌రెడ్డికి స్వయానా మామ బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి అల్లుడిని వైసీపీలోకి వ‌చ్చేయ‌మ‌ని కోరుతున్నట్టు టాక్ ? భూమా బ్రహ్మానంద‌రెడ్డి పార్టీ ప‌రంగా ప‌ట్టు ద‌క్కించుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నా స్థానిక కేడ‌ర్లో చాలా వ‌ర‌కు ఆయ‌న‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మెజార్టీ కేడ‌ర్ అంతా అంద‌రూ భూమాకు అనుచ‌రులే కావ‌డంతో.. అఖిల క‌నుస‌న్నల్లోనే అంద‌రూ మెలుగుతున్నారు. దీంతో అటు నియోజ‌క‌వ‌ర్గానికి, ఇటు పార్టీకి అన్ని విధాలా కుటుంబం నుంచి కూడా స‌పోర్టు లేని నాయ‌కుడిగా భూమా బ్రహ్మానంద‌రెడ్డి మిగిలిపోయారు. మ‌రి ఆయ‌న రాజ‌కీయం ఈ రెండేళ్లలో ఎలా మారుతుందో ? చూడాలి.

Tags:    

Similar News