బెజ‌వాడ చేరిన నందికొట్కూరు పంచాయితీ.. అదే ఫైనలటగా

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఏడాది వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ నాయకుడు ఆర్థర్ విజ‌యం సాధించారు. అయితే, ఆరు మాసాలు బాగానే ఉన్న ఈ [more]

Update: 2020-03-01 13:30 GMT

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఏడాది వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ నాయకుడు ఆర్థర్ విజ‌యం సాధించారు. అయితే, ఆరు మాసాలు బాగానే ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎంట్రీతో ఒక్కసారిగా ప‌రిస్థితులు తారుమారు అవుతున్నాయి. ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కరించాల్సిన ఎమ్మెల్యే, ఇత‌ర నాయ‌కులు త‌మ స‌మ‌స్యల్లో తామే కూరుకుపోయార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఆధిప‌త్య పోరు మ‌రింత‌గా పెరిగింద‌నే ప‌రిస్థితి తెలుస్తోంది. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంతో ఈ పోరు మ‌రింత‌గా ర‌చ్చ‌కెక్కింది.

నమ్మకమైన నాయకుడే అయినా….

ఆర్థర్ పార్టీలో న‌మ్మకంగా ఉన్న నాయ‌కుడు. అయితే, రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగా బైరెడ్డిని జ‌గ‌న్ ఇక్కడ పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో బైరెడ్డి త‌న హవాను పెంచుకునేందుకు ఎమ్మెల్యేపైనే ఆధిప‌త్యం ప్రద‌ర్శించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పర్యవేక్షణలో జ‌ర‌గాల్సిన ప‌నులు కూడా తానే అన్నీ అయి చూస్తున్నారు. కాంట్రాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవ‌డం, పార్టీలోని ఓ ప్రముఖ నాయ‌కుడితో సంబంధాలు నెర‌ప‌డం, ఎమ్మెల్యేది ఏమీలేదు.. అంతానాదే.. అని వ్యాఖ్యలు వినిపించ‌డం వంటివి చేస్తున్నారు. ఈ ప‌రిణామం ఇద్దరు నాయ‌కుల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితిని క‌ల్పించింది.

పంచాయతీ పెట్టినా…

బైరెడ్డి సిద్దార్థరెడ్డి నందికొట్కూరు వైసీపీ స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉన్నారు. అయితే, ఈయ‌న ఎమ్మెల్యే విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం.. ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీయ‌డంతో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉందనేది కొన్నాళ్లుగా వినిపిస్తున్న వాద‌న‌. ఈ క్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ క‌లుగ‌జేసుకుని చెప్పినా కూడా ప‌రిస్థితి చ‌ల్లబ‌డ‌క‌పోవ‌డం స్థానికంగా మార్కెట్ యార్డు చైర్మన్ ప‌ద‌వి విష‌యంలో ఎమ్మెల్యే సిఫార‌సులు బుట్టదాఖ‌లు కావ‌డంతో ఈ పంచాయితీ తాడేప‌ల్లికి చేరింది. జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారు స‌జ్జ‌ల నేరుగా ఎమ్మెల్యే ఆర్థర్‌, బైరెడ్డి, ఇంచార్జ్ మంత్రి అనిల్‌ను కూడా తాడేప‌ల్లికి పిలిపించి పంచాయితీ పెట్టారు.

రెండు మూడు రోజుల్లో….

స‌మ‌స్య తెలుసుకున్నారు. అయితే, ఇరువురు నాయ‌కులు కూడా కొన్ని విష‌యాల్లో ప‌ట్టుబ‌ట్టడంతో మ‌రోసారి భేటీ అవుదామ‌ని.. వివాదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లాల‌ని స‌జ్జల సూచించిన‌ట్టు స‌మాచారం. అయితే, ఆర్థర్‌పై పైచేయి సాధించాల‌ని చూస్తున్న బైరెడ్డిని ప‌క్కకు త‌ప్పించాల‌నే ప్ర‌తపాద‌న వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీనిపై సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించి రెండు మూడురోజుల్లోనే నిర్ణయం వెలువ‌రించేందుకు స‌జ్జల సిద్ధమ‌వుతున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News