జగన్ ను నడిపిస్తోంది ఆయనేనా?
అదేంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎవరి మాటా వినరు, ఆయనకు తోచిందే చేస్తారని ఓ వైపు విపక్షాలు సహా స్వపక్షంలోనూ అంతా అంటూంటారు. అటువంటి జగన్ కి [more]
అదేంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎవరి మాటా వినరు, ఆయనకు తోచిందే చేస్తారని ఓ వైపు విపక్షాలు సహా స్వపక్షంలోనూ అంతా అంటూంటారు. అటువంటి జగన్ కి [more]
అదేంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎవరి మాటా వినరు, ఆయనకు తోచిందే చేస్తారని ఓ వైపు విపక్షాలు సహా స్వపక్షంలోనూ అంతా అంటూంటారు. అటువంటి జగన్ కి కూడా ఒక బాస్ ఉన్నారట. ఆయనకు చెప్పకుండా జగన్ పాలన చేయనే చేయరట. మరి ఇంతటి రహస్యం ఎవరికి తెలుసు అంటే ఇంకెవరు కమ్యూనిస్ట్ వృధ్ధ నేత సీపీఐ నారాయణ పేరే చెబుతారు. ఆయనకు జగన్ గురించి అన్నీ తెలుసు. జగన్ పాలన ఎలా చేస్తారో, ఆయన నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో. ఆయన బాస్ ఎవరో ఇలా అన్నీ నారాయణ చెప్పేస్తున్నారు. మొత్తానికి ఏపీకి ముఖ్యమంత్రి జగన్ అయినా ఆయన బాస్ మాట మేరకే పాలిస్తారట. ఇంతకీ జగన్ బాస్ ఎవరో తెలుసా.
మోడీ గీత దాటరా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోడీ జగన్ కి డైరెక్ట్ బాస్ ట. మోడీకి చెప్పనిదే ఇటు ఫైలు అటు జగన్ కదలనీయరుట. ఇక ఏపీలో ఏ చిన్న నిర్ణయమైనా, పెద్ద నిర్ణయమైనా మోడీకి చెప్పాక ఆయన ఎస్ అంటేనే జగన్ తీసుకుంటున్నారుట. ఆ విధంగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా జగన్ తీసుకున్నారుట. ఇలా ఏపీని మూడు ముక్కలు చేయమని మోడీ మహాశయులే జగన్ కి సలహా ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారుట. అందుకే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం కరెక్ట్ అంటూ సంబరపడిపోతోందని కూడా నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.
డైనమిక్ అనుకుంటే…
జగన్ ఏదో ఉద్ధరిస్తారని చంద్రబాబుని ఓడించిన ప్రజలకు ఈయన కూడా చుక్కలే చూపిస్తున్నారని నారాయణ సెటైర్లు వేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరిట పేద రైతుల నడ్డి విరగ్గొట్టడంలో బాబుకు జగన్ సరిసాటిగా నిలిచారని కూడా నారాయణ అంటున్నారు. డైనమిక్ లీడర్ జగన్ అని ప్రజలే కాదు తాను కూడా ఓ టైంలో అనుకున్నానని, మరీ ఇంత అద్వాన్నంగా పాలన ఉంటుందని అనుకోలేదని కూడా నారాయణ గట్టిగానే కౌంటర్లేస్తున్నారు. జగన్ పాలన అయోమయంగా ఉందని, పేదలకు అందని పండుగా మారిందని నారాయాణ ఘాటుగానే తగులుకుంటున్నారు.
కబ్జాల సంగతి చూడు….
విశాఖలో రాజధాని పెడతాను అంటూ తెగ ఉత్సాహపడుతున్న జగన్ అంతకంటే ముందు అక్కడ చోటు చేసుకున్న భూ కబ్జా బాగోతాల సంగతిని ఒకసారి చూడమని సీపీఐ నారాయణ సలహా ఇస్తున్నారు. విశాఖలో రాజధాని కంటే ముందే ఇక్కడ భూములు కబ్జాకోర్ల కోరల్లోకి వెళ్ళిపోయాయని, దానికి అధికారుల మద్దతు కూడా ఉందని ఆయన అంటున్నారు. ఇప్పటికి నాలుగు వేల ఎకరాలకి పై చిలుకు ప్రభుత్వ భూమి ఇలా గద్దల్లా కబ్జా పెద్దలు కాజేస్తే అధికారులు కానీ ప్రభుత్వం కానీ కిక్కురుమనడంలేదని నారాయణ మండిపడుతున్నారు. దమ్ముంటే జగన్ ముందు కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వం భూమిని విడిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ళ కోసం బక్క రైతుల వద్ద భూమిని ల్యాండ్ పూలింగ్ చేయిస్తున్న జగన్ కబ్జాకు గురి అయిన ప్రభుత్వ భూమిని తీసుకుని పంచితే ఎవరూ అభ్యంతరం పెట్టరని ఆయన సలహా కూడా ఇచ్చారు. మొత్తానికి జగన్ ఎర్రన్న కన్నెర్రపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.