టీడీపీ నేతలకు తాయిలాలు ఇవేనా…?

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలో రాజ‌కీయ క‌ల‌క‌లం ప్రారంభ‌మైంది. జాతీయ పార్టీ బీజేపీ ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న క్రమంలో ఇక్కడ నుంచే పార్టీని అభివృద్ధి చేయాల‌ని రాష్ట్ర [more]

Update: 2019-07-24 02:00 GMT

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలో రాజ‌కీయ క‌ల‌క‌లం ప్రారంభ‌మైంది. జాతీయ పార్టీ బీజేపీ ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న క్రమంలో ఇక్కడ నుంచే పార్టీని అభివృద్ధి చేయాల‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. పార్టీల‌తో సంబంధం లేదు.. నాయ‌కుల‌తోనే సంబంధం అనే నినాదంతో బీజేపీ నాయ‌కులు దూసుకు పోతున్నారు. ఈక్రమంలోనే ముందుగా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైన టీడీపీ నేత‌ల‌కు వ‌ల విసురుతున్నారు. పార్టీలోకి వ‌స్తే.. కేసులు లేకుండా చేస్తాం.. కేంద్రంతో మంచి సంబంధాలు ఉండేలా చేస్తాం.. మీ బిజినెస్ ఇబ్బందులు తొలిగిస్తాం.. అంటూ.. హామీలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

కన్నా తాయిలాలు ఇవే….

ఇటీవ‌ల టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన వారంద‌రూ ఇలాంటి హామీల‌తోనే వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీని బూచిగా చూపించేందుకు కూడా బీజేపీ ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దులుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా టీడీపీ ఎదిగేదిలేద‌ని, ఆ పార్టీలో ఉన్నవారంతా ఏదో ఒక రోజు .. క‌మ‌లం గూటికి చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చెబుతున్నార‌ట‌. దీనికి అనుబంధంగా ఆయ‌న ప్రస్తుతం జ‌గ‌న్ పాల‌న‌నే చూపిస్తున్నార‌ట‌. త్వర‌లోనే చంద్రబాబును జైలుకు పంపించే కార్యక్రమానికి జ‌గ‌న్ ప‌క్కా వ్యూహంతో ఉన్నార‌ని, ఇక‌, చిన్నబాబు ఉన్నప్పటికీ.. పార్టీని కాపాడుకునే ప‌రిస్థితి కూడా లేద‌ని.. సో.. ఇక‌, టీడీపీలో ఉండి కూడా వ్యర్థమేన‌ని చెబుతున్నార‌ట‌.

అందుకే నేతలు….

ఈ నేప‌థ్యంలో తాజాగా గుంటూరు టీడీపీ నుంచి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. జిల్లాలోని నరసరావుపేటకు చెందిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. కాగా… కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అవడంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే జ‌రిగితే.. త్వర‌లోనే మ‌రింత ఇదే బాట ప‌ట్టనున్నార‌ని తెలుస్తోంది.

సీనియర్లు సయితం….

ఇక ఇదే జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మ‌రో ఇద్దరు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ బాట‌లో ఉన్నట్టు కూడా ప్రచారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా చాలా వ్యూహాత్మకంగా క‌న్నా.. ముందుకు సాగుతున్నార‌ని అనిపిస్తోంది. పార్టీలో చేర్చుకోవడం స‌రే.. పార్టీని ప్రజ‌ల్లోకి తీసుకు వెళ్తేనే ప్రయోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News