సత్తిబాబుపై చిన్నచూపా…?
రాజకీయాల్లో ఏం జరిగినా ఆసక్తిగా ఉంటుంది. సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వింటారు. చర్చించుకుంటారు కూడా! ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి ఏపీ [more]
రాజకీయాల్లో ఏం జరిగినా ఆసక్తిగా ఉంటుంది. సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వింటారు. చర్చించుకుంటారు కూడా! ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి ఏపీ [more]
రాజకీయాల్లో ఏం జరిగినా ఆసక్తిగా ఉంటుంది. సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వింటారు. చర్చించుకుంటారు కూడా! ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి ఏపీ కేబినెట్‌లో ప్రారంభమైంది. ఏపీలో వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీకి నిబద్ధతతో పనిచేసిన నాయకులకు ఆయన మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. వీరిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బొత్స.. జగన్ కేబినెట్‌లో పురపాలక మంత్రి పదవిని చేపట్టారు. అంతా సజావుగానే సాగుతున్న క్రమంలో.. ఈయనలో సీనియార్టీ అనే అంతర్మథనం ప్రారంభమైంది.
రాష్ట్ర విభజన చేయడంతో…..
నిజమే! ఒకరకంగా చూసుకుంటే.. జగన్ కంటే కూడా బొత్స రాజకీయాల్లో చాలా సీనియర్. జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా బొత్స రాజకీయాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. వైఎస్ హయాంలో కీలకమైన శాఖలనే నిర్వహించారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఆయన మంత్రిగా ఉన్నారు. నిజానికి ఆనాటికి జగన్ పెద్దగా రాజకీయాల్లో ఎదగలేదు. ఎంపీగా మాత్రమే ఉండేవారు. తన పనేదో తాను చూసుకునేవారు. కానీ, వైఎస్ మరణం తర్వాత జగన్ సొంతగా పార్టీ పెట్టుకోవడం, విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మట్టికొట్టుకు పోవడంతో బొత్స.. నేరుగా వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం తెలసిందే.
సీనియర్ ను అయినా….
అయితే, నిన్న మొన్నటి వరకు లేని సీనియార్టీ వివాదం ఇప్పుడు బొత్సలో రగులుతోంది. తనకు జగన్ తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనేది ఆయన ఆవేదన. ముఖ్యంగా శ్రీకాకుళం రాజకీయాలను శాసించాలనే బొత్స వ్యూహానికి అక్కడి వైసీపీ నాయకుడు కోలగట్ల వీర భద్రస్వామి అడ్డుకట్ట వేస్తున్నారు. ఏ విషయాన్నయినా.. నేరుగా జగన్ చెవిలో ఊదుతున్నారు. దీంతో బొత్స అసౌకర్యంగా భావిస్తున్నారు. నేను జగన్ కంటే కూడా సీనియర్ పొలిటీషియన్ అని ఆయన అనుకుంటున్నారు. అయితే, జగన్ మాత్రం ఎవరు ఎలాంటి, ఎంతటి సీనియర్లు అయినా.. తన మాట వినాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. నేరుగా బొత్సకు చెప్పకపోయినా.. ఆయన తన చేతల ద్వారా దీనిని నిరూపిస్తున్నారు. ఈ పరిణామమే బొత్సకు నిద్రలేకుండా చేస్తోంది.
డుమ్మా కొట్టడంపై…..
సీఆర్డీఏపై.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కీలక సమావేశానికి.. పురపాలక మంత్రి… బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై… జగన్ ఆరా తీశారు. గత సమీక్షలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం డుమ్మాకొ ట్టారు. ఈ పరిణామం వెనుక సీనియార్టీ రగడే చోటు చేసుకుని ఉంటుందని అంటున్నారు. మరి ఇది ఎలా సమసి పోతుందో చూడాలి.