ఇద్దరిపై అంచనాలు లేవే.. వారికే కీలక పదవులా?
టీడీపీలో తాజాగా ప్రకటించిన పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న వారిలో ఇద్దరే వారసులు కనిపిస్తున్నారు. వాస్తానికి చాలా మంది సీనియర్ నాయకులు తమ వారసులకు ఈ [more]
టీడీపీలో తాజాగా ప్రకటించిన పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న వారిలో ఇద్దరే వారసులు కనిపిస్తున్నారు. వాస్తానికి చాలా మంది సీనియర్ నాయకులు తమ వారసులకు ఈ [more]
టీడీపీలో తాజాగా ప్రకటించిన పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న వారిలో ఇద్దరే వారసులు కనిపిస్తున్నారు. వాస్తానికి చాలా మంది సీనియర్ నాయకులు తమ వారసులకు ఈ పదవులు దక్కుతాయని ఎదురు చూశారు. అయితే.. అనూహ్యంగా ఇద్దరికి మాత్రమే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వీరిలోమాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు, గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన.. కిమిడి నాగార్జున ఉన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ కుమారుడు..నవీన్‌కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
కళాను సంతృప్తిపర్చేందుకే…..
కిమిడి నాగార్జున పార్టీ కోసం ఇటీవల కాలంలో కృషి చేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేసి ప్రస్తుత మంత్రి బొత్స సత్యానారాయణ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నాగార్జున వైజాగ్‌లో నివాసం ఉంటూ చీపరుపల్లిలో ఓ విజిటింగ్ ప్రొఫెసర్ మాదిరిగా మారాడన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఇప్పటకీ ఆయన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులపై సరైన గ్రిప్ లేదు. ఈ పదవికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు సరైన వ్యక్తి అని జిల్లా టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే ఏపీ టీడీపీ పగ్గాలు కళా వెంకటరావు నుంచి తప్పిస్తారన్న వార్తల నేపథ్యంలో ఆ ఫ్యామిలీని సంతృప్తి పరిచేందుకు అదే ఫ్యామిలీకి చెందిన నాగార్జునకు విజయనగరం పార్టీ పార్లమెంటరీ పగ్గాలు అప్పగించారని అంటున్నారు.
సవాల్ లాంటిదే….
అత్యంత దీనస్థితిలో ఉన్న విజయనగరం జిల్లాలో పార్టీని సరైన ట్రాక్‌లో పెట్టడం రాజకీయాల్లో అంత అనుభవం లేని నాగార్జునకు సవాల్ లాంటిదే అని చెప్పాలి. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గాన్ని టీడీపీవై పు తిప్పగల నాయకుడిగా పేరున్న జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కు కూడా చంద్రబాబు మంచి అవకాశం కల్పించారని అంటున్నారు. అంత్యంత కీలకమైన కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చంద్రబాబు.. జ్యోతుల నవీన్‌కు అప్పగించారు.
కాపు కోటాలో….
యువ నేత, వివాద రహితుడు.. కాపు సామాజిక వర్గంలో గుర్తింపు ఉన్న నవీన్‌కు ఈ పదవి దక్కడంపై టీడీపీ వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కాకినాడ పార్లమెంటరీ జిల్లా పరిధిలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయనకు ఈ పదవి కట్టబెట్టారు. మరి పార్టీ పగ్గాలు దక్కించుకున్న ఈ ఇద్దరు వారసులపై పెద్దగా అంచనాలు లేవు. వీరు తమ పదవులకు ఎంత వరకు న్యాయం చేస్తారో ? కాలమే సమాధానం చెప్పాలి.