బాబు మీద పిచ్చి ప్రేమ

అందుకే సర్కార్ మెదళ్ళు అంటారు. అవి పదునెక్కవు, చురుకు అంత‌కంటే కనిపించదు. వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా సర్కార్ కార్యాలయాలు ఉంటాయి. అది సరే కానీ కీలకమైన విషయాల్లోనూ [more]

Update: 2019-07-30 12:30 GMT

అందుకే సర్కార్ మెదళ్ళు అంటారు. అవి పదునెక్కవు, చురుకు అంత‌కంటే కనిపించదు. వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా సర్కార్ కార్యాలయాలు ఉంటాయి. అది సరే కానీ కీలకమైన విషయాల్లోనూ ఇంతేనా, ఇదే రకమైన నిర్లక్ష్యమా అని ఆశ్చర్యపోవాల్సివస్తుంది. సాక్షాత్తూ మంత్రివర్యులే ప్రభుత్వ అధికారుల బద్దకాన్ని చూసి షాక్ తినాల్సివస్తోంది. విశాఖనగరం నడిబొడ్డున, కలెక్టరేట్ కి కూత వేటు దూరంలో ఉన్న ఘోషాసుపత్రి గోడలకు ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బొమ్మ తగిలించి ఉంచారు. ఇదే వింత అనుకుంటే మాజీ వైద్య ఆరోగ్యమంత్రిగా కామినేని శ్రీనివాస్ బాబు పక్కన నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ పురుళ్ళ ఆసుపత్రిలో క్షణం తీరిక లేక ఇలా చేశారా అని అనుకోవడానికి లేదు. ఇది కచ్చితంగా నిర్లక్ష్యమే. ఎపుడో ఏడాదిన్నర క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ మంత్రి కామినేని ఫోటో ఇంకా తీసివేయలేదంటే వారికి తమ శాఖ మీద ఉన్న శ్రధ్ధ ఇదీ అని చెప్పకనే చెబుతున్నట్లైంది.

మంత్రి గారి వార్నింగ్….

ఈ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ అక్కడ గోడపై చంద్రబాబు బొమ్మ వేలాడుతూ ఉండడంతో ఆవేశంతో వూగిపోయారు, పక్కన కామినేని బొమ్మ చూసిన తరువాత ఆయన వల్ల కాలేదు, మీకు ఇంకా చంద్రబాబేనా ముఖ్యమంత్రి, జగన్ అంటే అంత తేలిగ్గా ఉందా అంటూ ఓ స్థాయిలో మండిపడ్డారు. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు ఎవరైనా చేస్తే వూరుకోమని గట్టి వార్నింగులే ఇచ్చారు. విషయమేంటంటే ఇలాంటి చంద్రబాబు బొమ్మలు విశాఖ జిల్లాలో ఇంకా చాలా చోట్ల సర్కార్ ఆఫీసుల్లో కనిపిస్తున్నాయి. మంత్రి గారు ఇచ్చిన హెచ్చరికతో ఇపుడు వారు కూడా సర్దుకుంటారేమో చూడాలి.

చిత్తూరులో కూడా….

ఇక దీనికి కొన్ని రోజుల ముందు చిత్తూరులోని ఓ విశ్వవిద్యాలయంలో ఇంకా చంద్రబాబునే సీఎం గా కొలుస్తున్న సంగతి వెలుగు చూసింది. దాని మీద కూడా వైసీపీ నేతలు నిలదీయడంతోనే అక్కడ విషయం బయటపడింది. అది కూడా వైద్య విద్యాలయం కావడం విశేషం. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతోంది. ఇంకా ప్రభుత్వ ఆఫీసుల్లో ఆయన ఫొటో పెట్టలేదంటే ఒకటి నిర్లక్ష్యం అయినా అయి ఉండాలి, లేదా పసుపు పార్టీ మీద పిచ్చి ప్రేమ అయినా ఉండాలి. వైసీపీ మంత్రులు ఇలా ప్రతీ ప్రభుత్వ ఆఫీస్ ని తనిఖీ చేస్తేనే తప్ప జగన్ బొమ్మ అక్కడ పడదేమో మరి. మరీ ఇంతలా రాజకీయం చేయడం ప్రభుత్వ ఆఫీసుల్లోనే చూస్తావేమో.

Tags:    

Similar News