మైండ్ గేమ్ తో మటాషేనా ?

మైండ్ గేమ్ చాలా డేంజర్. అలా అంటారు కానీ అది లేనిదెక్కడ అని కూడా ఉంది. ప్రేమికులలోనూ ఇదే మైండ్ గేమ్ తో కధ మొదలవుతుంది. ఇక [more]

Update: 2020-08-14 02:00 GMT

మైండ్ గేమ్ చాలా డేంజర్. అలా అంటారు కానీ అది లేనిదెక్కడ అని కూడా ఉంది. ప్రేమికులలోనూ ఇదే మైండ్ గేమ్ తో కధ మొదలవుతుంది. ఇక రాజకీయాల్లో అడుగడుగునా మైండ్ గేమ్ తోనే అంతా సాగుతోంది. ఇపుడు ఏపీ రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఈ మైండ్ గేమ్ తో ఏనుగు లాంటి టీడీపీని పీనుగు చేద్దామన్నదే ఎత్తుగడ. అప్పట్లో దిగ్గజ నేత ఎన్టీయార్ని గద్దె దించేందుకు చంద్రబాబు ఇలాంటి మైండ్ గేమ్ ఆడారు. మరో వైపు పార్టీ అంతా ఎన్టీయార్ కి వ్యతిరేకం అని కలరింగ్ తన అనుకూల మీడియా ద్వారా ఇప్పించారు చివరికి అది ఫలించి అంతటి పెద్దాయాన‌ గుడ్ల నీరు కక్కుకుంటూ ముఖ్యమంత్రి సీటు నుంచి దిగాల్సివచ్చింది.

అదిగో పులి….

ఏపీలో బీజేపీ బలం ఎవరికి తెలియదు, ఇక జనసేన పార్టీయే పెద్ద దిక్కుగా ఉంది. ఈ రెండు పార్టీలు కలసి దున్నేస్తామంటే నమ్ముతారా. కానీ నమ్మాలని బీజేపీ కలరింగు ఇస్తోంది. అంతే కాదు, ఏపీలోని కాపులంతా తమవైపే ఉన్నారని చెబుతోంది. మెగాస్టార్ చిరంజీవి తమతోనే ఉన్నారని కూడా బాజా వాయిస్తోంది. ఏపీలో పాతిక శాతం ఓట్లు తనవైపేనని సోము వీర్రాజు లెక్కలు చెబుతున్నారు. ఎక్కడ అంటే టీడీపీ ఓట్లు అన్నీ కూడా తమవేనని లాజిక్ గా మాట్లాడున్నారు. ఇక ఏపీలో టీడీపీ పని అయిపోయిందని కూడా కాషాయం పార్టీ అదే పనిగా చేస్తున్న ప్రచారమంతా తమ్ముళ్లను ఆకట్టుకోవడానికే.

అదే ఒప్పందమా…..

ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కొన్ని షరతులు పెడుతోంది. ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయమంటోంది. అలాగే ఎంతో మంది టీడీపీ నేతలు వస్తామన్నా కూడా జగన్ అంగీకరించడంలేదు. దీని వెనక కూడా మతలబు ఉందని అంటున్నారు. బీజేపీకి ఏపీలో వారిని వదిలేయడానికే జగన్ చేర్చుకోవడంలేదని కూడా వినిపిస్తున్న మాట. ఆ మధ్యన అంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కానపుడు సోము వీర్రాజు అన్న మాట ఏంటి అంటే మాకూ ఆకలి ఉంటుంది కదా, అందరూ వైసీపీలోకి వెళ్తే మేమేం కావాలి అని. అంటే దాని అర్ధం మాకు కూడా వదిలేయండి బాబూ అనే. అందుకే జగన్ టీడీపీ నేతలను పెద్దగా ఆకర్షించడంలేదని అంటున్నారు.

తమ్ముళ్ళు దూకేస్తారా…?

చంద్రబాబుకు అయితే పక్కా మైండ్ గేమ్ ఏపీలో బీజేపీ వైసీపీ ఆడుతోందని తెలుసు. ఆయన కూడా నిన్నటివరకూ బీజేపీతో తమకు దోస్తీ కుదురుతుంది అని గేమ్ ఆడారు. దాన్ని సోము బట్టబయలు చేశారు. చంద్రబాబు తమకు శత్రువే తప్ప పొత్తులు ఉండవని కూడా క్లారిటీగా చెప్పేశారు. టీడీపీ మునిగే పడవ, అందువల్ల మీరంతా వచ్చి కమలం నీడన తలదాచుకోండని పిలుపు ఇవ్వడమే దాని వెనక ప్లాన్. అయితే బాబు ఇపుడు ఈ మైండ్ గేమ్ ను ఎలా ఎదుర్కొంటారా అన్నదే చర్చ. మరో వైపు తమ్ముళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. వారు కూడా తలపండిన నాయకులే. బీజేపీ జన‌సేన జట్టు అంటూ ఎంతలా బిల్డప్ ఇచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వారికి తెలుసు కదా. వెళ్తే వైసీపీలోకి వెళ్దాం, లేకపోతే 2024 ఎన్నికల ముందు వరకూ చూసి అనాటికి బీజేపీ కూటమిది వాపో బలమో తేల్చుకునే ఎంట్రీ ఇద్దామనుకునే బాపతే ఇపుడు పసుపు పార్టీలో ఉన్నారని అంటున్నారు. మరి హైప్ పెంచడానికి సోము వీర్రాజు రొజురోజుకూ వేస్తున్న ఎత్తులు జిత్తులు టీడీపీ శిబిరాన్ని ఎంతవరకూ కకావికలం కాకుండా ఉంచుతాయన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News