బుక్ చేద్దామని బాబు … తప్పించుకుంటున్న కమలం ?

టిడిపి వెర్సెస్ బిజెపి మాదిరి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జోరుగా నడుస్తున్నాయి. అమరావతి నుంచి రెండు ముక్కలను జగన్ ప్రభుత్వం తరలించే ప్రయత్నం జరిగితే ఆ [more]

Update: 2020-08-24 06:30 GMT

టిడిపి వెర్సెస్ బిజెపి మాదిరి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జోరుగా నడుస్తున్నాయి. అమరావతి నుంచి రెండు ముక్కలను జగన్ ప్రభుత్వం తరలించే ప్రయత్నం జరిగితే ఆ తప్పంతా కమలం మీదకు తోసెయ్యాలన్నది టిడిపి ఎత్తుగడగా తేలిపోయింది. కేంద్రాన్ని ఈ వ్యవహారానికి బాధ్యుల్ని చేయడం ద్వారా రెండు రకాల లబ్ధిని టిడిపి పొందాలని వ్యూహం పన్నింది. మూడు రాజధానుల అంశం అమల్లోకి వస్తే దీనికి కర్త కర్మ క్రియ అంతా మోడీ గా ప్రచారం జరిగితే రాజకీయ లబ్దికి ఛాన్స్ ఉంటుందని చంద్రబాబు లెక్క వేశారు. అదే జగన్ తరలించలేకపోతే ఇది తన విజయంగా ప్రచారం ఆటోమేటిక్ గా మార్పు చేసుకోవాలని చంద్రబాబు ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆయన ప్రయత్నాలు ముందే గ్రహించిన బిజెపి ఆదిలోనే బాబు వ్యూహానికి చెక్ పెట్టేసింది. ఇది కేంద్ర పరిధిలోనిది కాదంటూ తేల్చేసింది. అధికారప్రాతిపక్షాల రాజకీయ రగడ మాకేంటి సంబంధం అనేసింది.

ట్యాపింగ్ లోను అదే …

ఇప్పుడు తమ టెలిఫోన్ లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ టిడిపి ఆరోపణలు మొదలు పెట్టింది. వారి అనుకూల న్యాయవాదులు హై కోర్ట్ కి అలాగే అనుకూల మీడియా సపోర్టింగ్ స్టోరీస్ లో ఈ వ్యవహారంలో బిజీ బిజీ అయిపోయాయి. ఇక చంద్రబాబు దీంట్లోకి నరేంద్ర మోడీ ని సైతం లాగేశారు. ఆయనకు లేఖ రాసి ఇది మీరే చుడండి అంటూ ఇరికించారు. ఈ నేపథ్యంలో మరోసారి బిజెపి నేతలు చంద్రబాబుకి చురకలు అంటించేశారు. అయిన దానికి లేనిదానికి కేంద్రం దగ్గర ఈ పంచాయితీలు ఏమిటి అంటూ ఆ పార్టీ నేత జివి ఎల్ నరసింహారావు ఘాటుగానే స్పందించారు.

న్యాయవ్యవస్థ లోపాలను….

చంద్రబాబు వ్యవస్థల మేనేజ్ మెంట్ వ్యవహారాన్ని సూటిగానే ఆయన గుర్తు చేశారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు పై సిబిఐ దర్యాప్తు కి కోర్టు ఇచ్చిన స్టే 14 సంవత్సరాలు గా ఉండిపోవడాన్ని ఆయన నర్మగర్భంగా ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థ లోపాలను దీనితో ఎత్తి చూపుతూ బాబు రాజ్యాంగ వ్యవస్థలతో ఆడే ఆట ఎలాంటిదో చెప్పక చెప్పేశారు. ఇలా గతంలో మాదిరి బిజెపి ఇప్పుడు నోరు కట్టుకోవడం లేదు. టిడిపి తమపై ఏ వ్యూహం పన్నుతున్నా దాన్ని ప్రజల ముందే విప్పేసి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పరువు నిలువునా తీసేస్తుండటంతో రసవత్తర రాజకీయం ఎపి లో మొదలైనట్లే కనిపిస్తుంది.

Tags:    

Similar News